“అఖండ” పై జూ.ఎన్టీఆర్ రివ్యూ, మహేష్ స్పందన

By Surya PrakashFirst Published Dec 3, 2021, 7:23 AM IST
Highlights

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. 

బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి, ఈసారి కూడా బాలయ్య కోసం, అతడి ఫ్యాన్స్ కోసం అఖండ రూపంలో ఫుల్ మాస్ మసాలా అందించాడు. కథను, లాజిక్స్ ను పూర్తిగా గాలికొదిలేశాడని అన్నా ...థియోటర్స్ దగ్గర మాస్ జాతర జరుగుతోంది. ఈ స్దాయి రెస్పాన్స్ కేవలం అభిమానులనే కాదు సిని జనాలకు గాల్లో తేలేలా చేస్తోంది. రేపు తమ సినిమాలకు ఖచ్చితంగా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర టీమ్ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. జూ. ఎన్టీఆర్ ఈ సినిమా చూసారు. ఆ ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ ఇప్పుడే అఖండ సినిమా చూడటం పూర్తయిందని, మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి సక్సెస్ అభిమానులకు అనందించే క్షణాలని అన్నారు.

Also read Akhanda: బెనిఫిట్ షోలతో దోచేస్తున్నారు- కేతిరెడ్డి

 ''#అఖండ భారీ ప్రారంభాన్ని పొందిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీను గారు మరియు టీమ్ మొత్తానికి అభినందనలు'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ప్రేక్షకుల్లో ‘అఖండ’ ఫీవర్ చూస్తుంటే ఆనందంగా ఉందని.. బాలకృష్ణ - బోయపాటి శ్రీనులకు హీరో రామ్ పొతినేని అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నానని.. ఇండస్ట్రీకి మరలా రిలీజ్ డే ఎనర్జీని అందించిన బాలయ్య బోయపాటికి ధన్యవాదాలు అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.

Also read బాలయ్య ‘అఖండ’రివ్యూ

'బాలకృష్ణ గారు గేట్లు ఓపెన్ చేశారు.. అఖండ టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్' అని నాని ట్వీట్ చేశారు. ఇది మాస్ జాతర అని పేర్కొన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. #NBK 107కి సిద్ధంగా ఉండమని అన్నారు. వీరితోపాటు మంచు లక్ష్మి - రచయిత కోన వెంకట్ - యువ హీరో నిఖిల్ సిద్దార్థ - నటుడు బండ్ల గణేష్ - డైరెక్టర్ నందిని రెడ్డి తదితరులు 'అఖండ' చిత్ర టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

click me!