‘దేవర ఎట్ వర్క్’.. ఎక్కడున్నా అందులో మార్పుండదు.. వైరల్ గా మారిన ఎన్టీఆర్ ఫొటో

By Asianet News  |  First Published May 29, 2023, 8:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఓ ఫొటోలను షేర్ చేయడం వైరల్ గా మారింది.
 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో తెలిసిందే. ప్రతి మూవీలో కొత్తదనం చూపిస్తూ.. పాత్రకు తగిన విధంగా తనను తాను మార్చుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. గ్లోబల్ స్టార్ గానూ క్రేజ్ దక్కించుకున్నారు. దీంతో తారక్ రాబోయే చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 

తారక్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Devara చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరో షెడ్యూల్ కు సిద్ధం అవుతున్నారు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు బయల్దేరారు. నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య లక్ష్మి ప్రణతి, ఇద్దరు పిల్లలతో కనిపించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ‘దేవర’కు కొంచెం గ్యాప్ ఇచ్చారు. 

Latest Videos

కానీ, తాజాగా ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నఓ ఫొటోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ‘దేవర ఎట్ వర్క్’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వెకేషన్ లో ఉన్న ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా వర్కౌట్ విషయంలో మార్పు ఉండదని జిమ్ ట్రైనర్ క్యాప్షన్ ఇచ్చారు. దేవర చిత్రం కోసం ఎన్టీఆర్ జిమ్ లో చెమటోడుస్తుండటంతో  తారక్ పట్టుదలకుప్రశంసలు కురుస్తున్నాయి. టైట్ కండలతో, ఉగ్రరూపంతో ఎన్టీఆర్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తారక్ కళ్లలోకి చూస్తే నిజంగా భయమేస్తుందంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.

ఇక Devara movieలో ఎన్టీఆర్ భయమంటే ఎరుగని ఓ దీవిలోని  మనుషులకు భయం పుట్టించే పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కొరటాల శివ ఇచ్చిన ఇంట్రడక్షన్ కు సినిమాపై తారా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎన్టీఆర్ సరసన ఆడిపాడుతోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

click me!