లంబోర్ఘిని కారుతో జూ.ఎన్టీఆర్.. ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు, టిడిపి నుంచి పోటీ చేసిన..

pratap reddy   | Asianet News
Published : Aug 25, 2021, 02:01 PM ISTUpdated : Aug 25, 2021, 02:08 PM IST
లంబోర్ఘిని కారుతో జూ.ఎన్టీఆర్.. ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు, టిడిపి నుంచి పోటీ చేసిన..

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా నిలిచాడు. హీరోగా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న యంగ్ టైగర్..  ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా నిలిచాడు. హీరోగా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న యంగ్ టైగర్..  ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఖరీదైన లంబోర్ఘిని లేటెస్ట్ మోడల్ కారుని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్యూల్ కారుని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ గా ఎన్టీఆర్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రాగానే ఆ కారు ఎన్టీఆర్ గ్యారేజ్ కు చేరింది. ఈ కారు ధర రూ 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా తన లంబోర్ఘినితో ఫోజు ఇచ్చాడు. అది కూడా ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులతో కలసి. హీరో శ్రీకాంత్, టిడిపి తరుపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన చలమశెట్టి సునీల్ ని ఎన్టీఆర్ తో కలసి చూడవచ్చు. 

ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఆర్ఆర్ ఆర్ షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ తదుపరి కొరటాల దర్శకత్వంలో రెండవసారి నటించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ షో తొలి ఎపిసోడ్ ఆగష్టు 22న ప్రసారం అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా
Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్