షారూఖ్‌తో తలపడేది మరో యాక్షన్‌ హీరోనా?

Published : Aug 22, 2020, 09:03 AM IST
షారూఖ్‌తో తలపడేది మరో యాక్షన్‌ హీరోనా?

సారాంశం

ఎట్టకేలకు ఓ సినిమాని ప్రకటించాలని షారూఖ్‌ భావిస్తున్నారు. తాను చేయబోయే దర్శకుల జాబితా చాలానే వినిపిస్తుంది. అందులో రాజ్‌కుమార్‌ హిరానీ పేరు ప్రముఖంగా హల్‌చల్‌ చేస్తుంది.

బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ దాదాపు రెండేళ్ళుగా కొత్త సినిమాని ప్రకటించడం లేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల వరకు ఆయన్నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఇక షారూఖ్‌ని మర్చిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.  

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ సినిమాని ప్రకటించాలని షారూఖ్‌ భావిస్తున్నారు. తాను చేయబోయే దర్శకుల జాబితా చాలానే వినిపిస్తుంది. అందులో రాజ్‌కుమార్‌ హిరానీ పేరు ప్రముఖంగా హల్‌చల్‌ చేస్తుంది. కానీ దీనిపై షారూఖ్‌ నుంచిగానీ, రాజ్‌ కుమార్‌ హిరానీ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. 

సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి ఈ బాద్‌షా సైన్‌ చేసినట్టు సమాచారం. తన నెక్ట్స్ సినిమా ఇదే అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది హై ఓల్టేజ్‌ యాక్షన్‌గా తెరకెక్కనుందని, ఇందులో మరో యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహాం విలన్‌గా కనిపించబోతున్న తెలుస్తుంది. షారూఖ్‌, జాన్‌ అబ్రహం మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు వెండితెరని షేక్‌ చేస్తాయని, సినిమాకి `పఠాన్‌` అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు సమాచారం.  ఇదిలా ఉంటే ఇందులో అదిరిపోయే మరో న్యూస్‌ హల్‌ చేస్తుంది. ఇందులో షారూఖ్‌కి జోడీగా దీపికా పదుకొనె నటించబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 

షారూఖ్‌ చివరగా `జీరో` చిత్రంలో నటించారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పరాజయం చెందింది. మరోవైపు జాన్‌ అబ్రహాం హిందీలో `ఎటాక్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కావడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే