తాను యోధుడిగా మారతానంటోన్న రాజమౌళి.. ఎందుకంటే?

Published : Aug 22, 2020, 08:37 AM IST
తాను యోధుడిగా మారతానంటోన్న రాజమౌళి.. ఎందుకంటే?

సారాంశం

ప్లాస్మా దానం చేసే విషయంలో అనుమానాలు అక్కర్లేదని, కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా అనేది బ్రహ్మాస్గ్రంగా పని చేస్తుంది. అందుకే ప్లాస్మాని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతామని రాజమౌళి తెలిపారు. 

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఆయన కోలుకుని కూడా చాలా రోజులవుతుంది. మూడు వారాల తర్వాత వైద్యుల సూచనల మేరకు ప్లాస్మా డొనేట్‌ చేస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ యోధుడిగా మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ, ప్లాస్మా దానం చేసే విషయంలో అనుమానాలు అక్కర్లేదని, కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా అనేది బ్రహ్మాస్గ్రంగా పని చేస్తుంది. అందుకే ప్లాస్మాని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతామని రాజమౌళి తెలిపారు. ప్లాస్మా దానం చేసిన వారు నిజమైన హీరోలని, తాము వెండితెరపై చాలా మంది హీరోలను చూస్తుంటాం. కానీ నిజమైన హీరోలు మీరే అని ప్లాస్మా దానం చేసే వారిని ఉద్దేశించి తెలిపారు. ప్లాస్మాతో ఒక ప్రాణం నిలుస్తుందని, అందుకే వారు నిజమైన యోధులన్నారు. 

 తాము కూడా హీరోలుగా మారాలనుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే తాను ప్లాస్మా దానం చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో తామ కూడా యోధులమవుతామన్నారు. ప్లాస్మా తీసినంత మాత్రన ఏమీ కాదని, తిరిగి అది మూడు రోజుల్లో వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానానికి సంబంధించి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేస్తున్న అవగాహన కార్యక్రమాలను రాజమౌళి అభినందించారు. పోలీసుల డ్యూటీలో ఇది భాగం కాకున్నా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లని ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్‌ను ప్రోత్సహిస్తున్నారని, వారు నిజంగా రక్షక భటుల్లాగా పనిచేస్తున్నారని కొనియాడారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా