ఈ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌ను జియో సినిమా ఈ రోజు(నవంబర్ 7) నుంచి ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్ చూడాలనుకునే వారు తప్పనిసరిగా జియో సినిమా సబ్ స్క్రిప్సన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరిస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గురించి ప్రత్యేకంగా పరిచయం చేసేదేమీ లేదు. ఇక్కడ ఇండియాలోనూ ఈ సీరిస్ కు వీరాభిమానులు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పాపులారిటీ పొందిన ఫాంటసీ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇప్పుడు ఇండియాలో రీజనల్ లాంగ్వేజెస్ లో ప్రసారమం మొదలైంది. సెక్స్, న్యూడిటీ కంటెంట్లతో నింపేసిన ఈ టీవీ షో ఇండియాలో కాస్త ఆలస్యంగానే అడుగుపెట్టింది. ఇంతకు ముందు ఇంగ్లీష్ లో ఈ HBO సీరిస్‌లను ‘స్టార్ వరల్డ్’, ‘స్టార్ వరల్డ్ HD’ ప్రసారం చేస్తోంది. ఇప్పుడు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల్లో ప్రసారం అవుతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కు వీరాభిమానులు ఉన్నారు. 73 ఎపిసోడ్స్‌గా ప్రసామైన ఈ సిరీస్ 2019లో ముగియగా దీనికి కొనసాగింపుగా హౌజ్ ఆఫ్ డ్రాగన్స్ పేరిట మరో కొత్త సీజన్ 2022లో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో అనువాదమై నిన్నటి నుంచి ప్రసారం అవుతున్నది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌ను జియో సినిమా ఈ రోజు(నవంబర్ 7) నుంచి ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్ చూడాలనుకునే వారు తప్పనిసరిగా జియో సినిమా సబ్ స్క్రిప్సన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ లో కిట్ హరింగ్టన్, ఎమిలా క్లార్క్, సోఫీ టర్నర్, మైసీ విలియమ్స్, లీనా హెడీ, పీటర్ డింక్లేజ్, సీన్ బీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో రెండు రాజ్యాల మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించారు. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా జియో సినిమా సబ్ స్క్రిప్షన్ తీసుకోండి మరి.