యూఎస్ లో భారీగా రిలీజ్ కాబోతున్న కార్తీ జపాన్ మూవీ, ఎన్ని థియేటర్లంటే..?

ఈసారి సాలిడ్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు కోలీవుడ్ యంగ్ స్టార్ కార్తీ.  తమిళనాట మాత్రమే కాదు.. ఓవర్ సిస్ లో కూడా భారీ రిలీజ్ కు ప్లాన్ చేశాడు యంగ్ హీరో. 
 


పాన్ ఇండియా మార్కెట్ ను గట్టిగా టార్గెట్ చేశాడు తమిళ యంగ్ హీరో కార్తీ. తమిళ సినిమాతో పాన్ ఇండియానే కాదు..పాన్ వరల్డ్ ను కూడా టార్గెట్ చేశాడు కార్తీ. తెలుగు తమిళంతో పాటు.. తెలుగులో కార్తికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసింది. అటు తమిళ, తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉన్న అమెరికాలో తన సినిమాను భారీ రిలీజ్ కు ప్లాన్ చేశాడు. జపాన్ సినిమాతో భారీ కలెక్షన్స్ పై కన్నేశాడు తమిల హీరో. 

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జపాన్‌. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నవంబర్ 10, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9 వ తేదీన యూఎస్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అక్కడ భారీగా రిలీజ్ కానుంది. దాదాపు 400 కి పైగా థియేటర్ల లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 

Latest Videos

ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్‌ ప్రక్రియను క్లియర్ చేసింది. 156 నిమిషాల మంచి రన్‌టైమ్ ను కలిగి ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్, విజయ్ మిల్టన్, కెఎస్ రవికుమార్, సనల్ అమన్, వాగై చంద్రశేఖర్ మరియు ఇతర ప్రముఖ నటులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

click me!