మోహన్ లాల్ జిమిక్కి కమ్మల్ వెర్షన్ కు విశేష స్పందన

Published : Sep 25, 2017, 01:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మోహన్ లాల్ జిమిక్కి కమ్మల్ వెర్షన్ కు విశేష స్పందన

సారాంశం

కాలేజీ అమ్మాయిలు స్టెప్పులేసిన జిమిక్కి కమ్మల్ వీడియో వైరల్ తాజాగా మోహన్ లాల్ తో కలిసి కొత్త వీడియో రూపొందించిన స్టూడెంట్స్ యూ ట్యూబ్ లో విడుదల చేసిన కాసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్

 

ఇటీవల కేరళలో ఓనం పండగ సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ లో కొంతమంది అతివలు నర్తించిన ‘జిమిక్కి కమ్మల్’ డాన్స్ వీడియో ఎంత పెద్ద హిట్టైందో వేరే వివరించనక్కర్లేదు. ఇప్పటి వరకూ ఈ వీడియోను యూట్యూబ్ లో అక్షరాలా 1,69,70,397 మంది వీక్షించారు. ఇక ఈ వీడియోకు వచ్చినన్ని పేరడీలు, అనుకరణలు ఈ మధ్య కాలంలో మరే వీడియోకూ రాలేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా దక్షిణాదిన చర్చనీయాంశంగా మారిపోయింది ఆ వీడియో.



మరి ఇప్పుడు దీనికి సంబంధించిన మరో వెర్షన్ వచ్చింది. ఇది కేరళలలోని ఒక కాలేజీ విద్యార్థులు రూపొందించినదే. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వెర్షన్లో మోహన్ లాల్ కూడా మెరుస్తాడు. విద్యార్థులకు లాల్ కూడా తోడై.. జిమిక్కి కమ్మల్ స్టెప్పులు వేస్తాడు. మోహన్ లాల్ ఈ వీడియోలో కనిపిస్తుండటంతో దీనికి ఎనలేని ఆదరణ లభిస్తోంది. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.

 

వాస్తవానికి జిమిక్కి కమల్ సాంగ్ మోహన్ లాల్ తాజా సినిమా ‘వెలిపడింతే పుస్తకం’లోనిది. సినిమాలోని ఆ పాట సూపర్ హిట్. దానికే ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అతివలు డాన్స్ చేసి సంచలనం రేపారు. సినిమాలోని పాటలో మోహన్ లాల్ కనిపిస్తాడు. పాట పూర్తి అవుతున్నప్పుడు సైకిల్ మీద ఎంట్రీ ఇస్తాడు. 
 

PREV
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం