
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం దసరా పండుగకి ఒక్క రోజు ముందే పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కంటెంట్ అద్భుతంగా వుంటుందని, ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని దర్శకుడు మారుతి హామీ ఇస్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. గ్రాండ్ లెవెల్ లో పెద్దయెత్తున థియేటర్లలో సినిమా రిలీజ్ చేయబోతున్నామని అంతా వచ్చి.. ఎంజాయ్ చేయాలని మారుతి కోరారు.
ఇక మహానుభావుడు ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన బాహుబలి ప్రభాస్ తనకు శర్వానంద్ అంటే ఎంటో ఇష్టమని, రన్ రాజా రన్ సినిమా చూసినప్పుడే... తమ్ముడూ హిట్ కొడుతున్నామని చెప్పాననని, అంత కాన్ఫిడెంట్ గా కనిపించే హీరో శర్వానంద్ అని ప్రబాస్ అన్నారు. ఆ కేరక్టర్ కు పక్కాగా సరిపోయిన శర్వా అప్పుడెలా హిట్ కొట్టాడో.. తాజాగా ఈ దసరాకు రిలీజౌతున్న మహానుభావుడు చిత్రంతో కూడా అంతే పెద్ద హిట్ కొడతాడని ప్రబాస్ అన్నాడు. అంతేకాదు.. ఈ సారి పండగకు సూపర్ స్టార్ శర్వానందే నని స్పష్టం చేశాడు ప్రభాస్.
ఈ దసరా సీజన్ కు ఇప్పటికే రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ నమోదు చేసుకున్న జై లవకుశ మరిన్ని రికార్డులు కొల్లగొట్టే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు... సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ కూడా ఈనెల 27న రిలీజ్ కానుంది. దీంతో శర్వానంద్ ను ఈ పండగ సూపర్ స్టార్ శర్వానే అనటంతో.. మహేష్ ఫ్యాన్స్ అంతా ఆలోచనలో పడ్డారు. మరి సూపర్ స్టార్ మహేష్ కదా సూపర్ స్టార్, ప్రభాస్ శర్వానంద్ ను అలా సూపర్ స్టార్ అనేశాడేంటని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా,,. సంక్రాంతి హీరోలకు, దసరా హీరోలకు శర్వానంద్ చాపకింద నీరులా వచ్చి షాకులిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజైన మహానుభావుడు టీజర్, లిరికల్ సాంగ్స్ ట్రైలర్ అన్నీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మహానుభావుడుపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.