జిగేలు రాణి హవా చూశారా..?

Published : May 14, 2018, 04:54 PM IST
జిగేలు రాణి హవా చూశారా..?

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇప్పటికీ ఈ సినిమా తన సత్తా చాటుతూనే ఉంది. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. సినిమాలో ప్రతి ఒక్క పాట శ్రోతలను అలరించింది. ముఖ్యంగా 'జిగేలు రాణి' అనే ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది.

సినిమాలోనే కాకుండా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రంగస్థలం సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందుగా యూట్యూబ్ లో జిగేలు రాణి పాటను విడుదల చేశారు. విడుదల చేసిన పన్నెండు గంటల్లో ఈ సినిమా 2 మిలియన్ వూస్ దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కరోజులో దాదాపు 2.8 మిలియన్ వ్యూస్ ను రాబట్టగలిగింది.

సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం దర్శకుడు సుకుమార్ పనితనానికి నిదర్సనం. ఈ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించి మరింత గుర్తింపు పొందింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?