దెయ్యంగా భయపెట్టనున్న జాన్వీకపూర్!

Published : Mar 30, 2019, 09:57 AM IST
దెయ్యంగా భయపెట్టనున్న జాన్వీకపూర్!

సారాంశం

దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నటిగా ఇప్పుడు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. 

దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నటిగా ఇప్పుడు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. 'ధడక్‌' లాంటి లవ్ స్టోరీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే భారత పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటించడానికి అంగీకరించారు.

పైలెట్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ షూటింగ్ లో జాయిన్ అయింది. తాజాగా ఆమె మరో చాలెంజింగ్ పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది. ఈసారి ఏకంగా రెండు పాత్రలో కనిపించనుంది ఈ బ్యూటీ.

అందులో ఒకటి దెయ్యం పాత్ర అని తెలుస్తోంది. గతేడాదిలో రాజ్ కుమార్ రావ్ తో 'స్త్రీ' సినిమాను నిర్మించిన దినేజ్ విజయ్ ఈ హారర్ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావ్ నే హీరోగా తీసుకున్నారు.

హార్థిక్ మెహతా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి 'రుహి అప్జా' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఈ ఏడాది జూలైలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా