నాని 'జెర్సీ' షాకింగ్ బిజినెస్.. అంత రాబడుతుందా..?

By Udaya DFirst Published Apr 15, 2019, 2:55 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. 'దేవదాసు' సినిమా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. అయితే నాని మార్కెట్ పై ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేడనే చెప్పాలి.

తాజాగా నాని నటించిన 'జెర్సీ' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.52 కోట్ల వరకు జరిగిందని సమాచారం. శాటిలైట్ రైట్స్ 12 కోట్లు, హిందీ  డ‌బ్బింగ్  రైట్స్ 6 కోట్లు, ఓవ‌ర్సీస్ రైట్స్ 4 కోట్లు, ఏపీ, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ 30 కోట్ల‌కు అమ్మ‌డుపోయిన‌ట్లు యూనిట్ వ‌ర్గాల సమాచారం.

నాని సినిమాలు ఇప్పటివరకు ఇరవై నుండి పాతిక కోట్ల రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగేవి. కానీ ఇప్పుడు ఆ నంబర్ డబుల్ అయింది. ఓవర్సీస్ లో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య అతడు నటించిన సినిమా అక్కడ పెద్దగా ఆడలేదు. 

అయినప్పటికీ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ హక్కులను నాలుగు కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. హిట్ టాక్ వస్తే గనుక అక్కడ ఇంత మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

click me!