జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్స్!

Published : Apr 20, 2019, 11:36 AM IST
జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్స్!

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత పాజిటివ్ టాక్ అందుకుంటున్నాడు. గత మూడు సినిమాలతో పెద్దగా మెప్పించని ఈ యువ హీరో జెర్సీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు.

న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత పాజిటివ్ టాక్ అందుకుంటున్నాడు. గత మూడు సినిమాలతో పెద్దగా మెప్పించని ఈ యువ హీరో జెర్సీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్స్ అందుకున్న జెర్సీ ఓవర్సీస్ లో 1.70కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక లో కోటికి పైగా కలెక్షన్స్ రాగా వరల్డ్ వైడ్ గా 7.12కోట్ల షేర్స్ ను జెర్సీ అందుకుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జెర్సీ సినిమాకు మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మించారు. 

పోటీగా కాంచన 3 రిలీజయినప్పటికీ నాని సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. జెర్సీ సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ వల్ల మిగతా సినిమాల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?