తారక్ కామెంట్.. నాని ఫుల్ హ్యాపీ!

Published : Apr 20, 2019, 11:03 AM ISTUpdated : Apr 20, 2019, 11:15 AM IST
తారక్ కామెంట్.. నాని ఫుల్ హ్యాపీ!

సారాంశం

బిగ్ బాస్2 ద్వారా నాని ఎప్పుడు లేని విధంగా చాలా టెన్షన్స్ చూశాడని అందరికి తెలిసిందే. హౌస్ లో జరిగిన గొడవలన్నిటిని పక్కనపెడితే మెయిన్ గా నాని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వల్ల కాస్త ఇబ్బంది పడ్డాడు.

బిగ్ బాస్2 ద్వారా నాని ఎప్పుడు లేని విధంగా చాలా టెన్షన్స్ చూశాడని అందరికి తెలిసిందే. హౌస్ లో జరిగిన గొడవలన్నిటిని పక్కనపెడితే మెయిన్ గా నాని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వల్ల కాస్త ఇబ్బంది పడ్డాడు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి తారక్ తప్పుకోగానే నాని రావడంతో నానికి అంత సీన్ లేదనే ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. 

నాని జూనియర్ ని పలుసార్లు షోలో గుర్తుచేసుకున్నప్పటికీ తారక్ మాత్రం ఆ సెకండ్ సీజన్ గురించి పెద్దగా స్పందించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఫైనల్ గా తారక్ నాని సినిమాపై మొదటిసారి పాజిటివ్ కామెంట్ చేశాడు. జెర్సీ సినిమా అద్భుతంగా ఉందంటూ.. నాని బ్రదర్ ని చూసి చాలా గర్వపడుతున్నట్లు చెప్పడంతో ఇరు వర్గాల అభిమానులు సంబరపడిపోతున్నారు. 

అసలైతే ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎన్టీఆర్ తో మంచి పరిచయం ఉంది. వంశీ అరవింద సమేత సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. దీంతో ఆ రిలేషన్ తో తారక్ కామెంట్ వేసాడని కొందరు అనుకోవచ్చు. కానీ తారక్ మెస్సేజ్ లో ఆప్యాయత కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎంతమంది హిరోలున్నా తారక్ ఫ్రెండ్లిగా ఉండేది చాలా తక్కువమందితో. ఇక ఇప్పుడు నానిపై ఈ విధంగా స్పందించడంతో అభిమానునాలతో పాటు నాని కూడా ఖుష్ అయ్యాడని చెప్పవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?