రాజశేఖర్‌ కోలుకుంటున్నారు.. పుకార్లని నమ్మవద్దుః జీవితా రాజశేఖర్‌

Published : Oct 22, 2020, 07:12 PM ISTUpdated : Oct 22, 2020, 07:18 PM IST
రాజశేఖర్‌ కోలుకుంటున్నారు.. పుకార్లని నమ్మవద్దుః జీవితా రాజశేఖర్‌

సారాంశం

నటి, రాజశేఖర్‌ భార్య జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది. తప్పుడు వార్తాలను, పుకార్లని నమ్మవద్దని పేర్కొంది. 

మూడు రోజుల క్రితం హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ ఫ్యామిలీ కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందంటూ ఉదయం వార్తలు వినిపించాయి. రాజశేఖర్‌ తనయ శివాత్మిక ట్విట్టర్‌ ద్వారా స్పందించి `డాడీ ఆరోగ్యం డిఫికల్ట్ గా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. అభిమానుల ప్రేమ, ప్రార్థనలు చేయాలని తెలిపింది. దీంతో రాజశేఖర్‌ ఆరోగ్యం మరీ క్రిటికల్‌గానే ఉందని ఆ తర్వాత చెప్పారు. దీంతో ఇది ఓ సందిగ్ధం నెలకొంది. 

తాజాగా దీనిపై నటి, రాజశేఖర్‌ భార్య జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది. తప్పుడు వార్తాలను, పుకార్లని నమ్మవద్దని పేర్కొంది. మా విషయంలో పాజిటివ్‌గా ఉండాలని, త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను ఈ సందర్భంగా జీవిత కోరింది. రాజశేఖర్‌ సిటీ న్యూరో సెంటర్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి