కషాయం అంటూ.. 8 నెలలు విషం తాగించారు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

Published : Jun 17, 2023, 09:07 PM IST
కషాయం అంటూ.. 8 నెలలు విషం తాగించారు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విషయం ప్రయోగం జరిగిందని.. అయిన బ్రతికి బయట పడ్డానన్నారు. ఇంతకీ ఆయనపై విషప్రయోగం చేసింది ఎవరు..? 

హీరోలందరిలో కాస్త డిఫరెంట్ గా ఉండేవారి లిస్ట్ తీస్తే.. అందులో జేడీ చక్రవర్తి పేరుముందే ఉంటుంది. ఆయన సినిమాలు.. ఆయన వ్యావహార శైటీ.. అన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి మరి.  విలక్షణ నటుడిగా పేరుపొందిన జేడి.. హీరోగా ...విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేశారు. కొంత కాలం సినిమాల్లో కనిపించడని జేడి.. తాజాగా దయ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈసినిమా త్వరలో  ఓటీటీలో రిలీజ్ కు రెడీగా ఉంది.  ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి.. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ ఇంటర్య్యూలో  సంచలన విషయాలు వెల్లడించారు చక్రవర్తి. తన పైజరిగిన విష ప్రయోగం గురించి వెల్లడించారు చక్రవర్తి. తనకు తన సొంత భార్య  స్లో పాయిజన్‌ పెట్టించిందని తెలిపారు. ఆ విషయంపై జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..  ఈ విషయం బయటకు ఎలా తెలిసిందో నాకు తెలియటం లేదు. ఈ విషయం ఓ ఇద్దరు, ముగ్గురికి మాత్రమే తెలుసు.అందులో తాను కూడా ఒకడిని అన్నారు జేడి.  అయితే అది ఎలా బయట పడింది అనే విషయం చెపుతూ..  

కొన్ని నెలల క్రితం నాకు బ్రీతింగ్‌ ప్రాబ్లం వచ్చింది.అయితే నాకు అది ఎందుకు వచ్చిందో తెలియదు..  నాకు సిగరెట్లు.. డ్రగ్స్ లాంటి అలవాట్లు లేవు.. మరి ఎందుకు ఇలా అయ్యిందో తెలియలేదు. ఒక సమయంలో అయినతే ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడ్డాను.  నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఉత్తేజ్‌.. ఓ మంచి డాక్టర్‌ను పంపించాడు. అప్పటి నుంచి అన్ని హాస్పిటల్స్ తిరిగాము.. ఇండియాలో ది బెస్ట్ డాక్టర్స్ చూశారు. ఆతరువాత శ్రీలంక డాక్టర్లు కూడా చూశారు. కాని ఏం లాభం లేదు.. పరిస్థితి చాలా ధారుణంగా తయారయ్యింది. డాక్టర్లు హోప్స్ లేవు అన్నారు. అంటూ.. అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు జేడి. 


డాక్టర్లు బతకటం కష్టం అని చెప్పేశారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్‌ నా ఫ్రెండ్‌. వాడు నా చిన్నప్పటినుంచి ఫ్రెండ్‌. అతడు లాయర్‌. నన్ను చాలా ఇబ్బందుల్లోనుంచి కాపాడాడు. వీరందరూ చాలా కష్టపడ్డారు. నాగార్జున అనే డాక్టర్‌ నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన కొన్ని టెస్టులు చేశారు. నాకు గత 8 నెలలుగా స్లో పాయిజన్‌ ఇస్తున్నారని తేల్చారు. నేను తీసుకుంటున్న కషాయంలో స్లో పాయిజన్‌ ఉన్నట్లు తెలిసింది. నాకు ఏ అలవాట్లు లేవు గనుక నా బాడీ స్లో పాయిజన్‌ను రిసీవ్‌ చేసుకుంది అని క్లియర్ గా చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?