జూ. ఎన్టీఆర్ ఇప్పుడు వస్తేనే.. పవన్ అంతటి వాడు కూడా.. జేసి కామెంట్స్!

Published : Jun 16, 2019, 03:18 PM ISTUpdated : Jun 18, 2019, 10:27 AM IST
జూ. ఎన్టీఆర్ ఇప్పుడు వస్తేనే.. పవన్ అంతటి వాడు కూడా.. జేసి కామెంట్స్!

సారాంశం

ఓ ఇంటర్వ్యూలో దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ముక్కు సూటిగా మాట్లాడడం మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డికి అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టిడిపి పగ్గాలు జూ. ఎన్టీఆర్ చేపట్టాలంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. జూ. ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది. కానీ టిడిపి గతంలో చంద్రబాబు నాయుడే దిక్కు. భవిష్యత్తులో కూడా టిడిపికి చంద్రబాబు తప్ప మరో నాయకత్వం లేదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇక జూ. ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే కొన్నేళ్ల తర్వాత మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. 

సినిమావాళ్లని చూడడానికి జనాలు వస్తారు. కానీ రాజకీయంగా వారు ఎదగడం కష్టం. పవన్ కళ్యాణ్ అంతటివాడు రాజకీయాల్లోకి వచ్చాడు.. పవన్ కి ఎంతపేరు ఉంది.. కానీ రాజకీయంగా ఏమైంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపడరని గతంలోనే చెప్పాను. పవన్, ఎన్టీఆర్ పై జెసి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?