హీరోయిన్ తిట్లకు సమాధానం ఇచ్చిన విశాల్!

Published : Jun 16, 2019, 02:09 PM IST
హీరోయిన్ తిట్లకు సమాధానం ఇచ్చిన విశాల్!

సారాంశం

తమిళ చిత్రపరిశ్రమలో నడిగర్ సంఘం ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరో విశాల్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజులగా శరత్ కుమార్, విశాల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.

తమిళ చిత్రపరిశ్రమలో నడిగర్ సంఘం ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరో విశాల్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజులగా శరత్ కుమార్, విశాల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరినొకరు విమర్శించుకకుంటున్నారు. ఇటీవల శరత్ కుమార్ ని విమర్శిస్తూ విశాల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనితో వరలక్ష్మి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన తండ్రిని విమర్శించడంతో విశాల్ పై మండి పడింది. 

విశాల్ మరీ దిగజారిపోయాడని, అతడిపై ఉన్న కమ్మకం పోయిందని వరలక్ష్మి వ్యాఖ్యానించింది. దీనిపై విశాల్ తాజాగా స్పందించాడు. వరలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా హుందాగా బదులిచ్చాడు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. వరలక్ష్మికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు ఉందని విశాల్ తెలిపాడు. గతంలో విశాల్, వరలక్ష్మి ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. 

మరోవైపు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా విమర్శలతో విశాల్ పై విరుచుకుపడింది. నిర్మాతల మండలిలో ఉన్న డబ్బు మొత్తం విశాల్ ఖాళీ చేశాడని రాధిక ఆరోపించింది. శరత్ కుమార్ ని విరిసించడానికి సిగ్గు లేదా.. న్యాయస్థానం ఎదుట నిలుచున్న నువ్వా విమర్శించేది అంటూ రాధిక విశాల్ పై దుమ్మెత్తి పోసింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?