గౌతమ్ మీనన్ పై కేసు వేస్తా.. జయలలిత మేనల్లుడు బెదిరింపులు!

Published : Sep 13, 2019, 12:36 PM IST
గౌతమ్ మీనన్ పై కేసు వేస్తా.. జయలలిత మేనల్లుడు బెదిరింపులు!

సారాంశం

దర్శకుడు గౌతమ్‌మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్‌ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 

దర్శకుడు గౌతమ్ మీనన్ కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఆయన రూపొందిస్తోన్న సినిమాలు రిలీజ్ కి నోచుకోవడం లేదు. వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఈయనపై కేసు వేస్తానని అంటున్నారు దివంగత ముఖ్యమంత్రి సోదరుడి కుమారుడు దీపక్.

జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కోలివుడ్ లో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు విజయ్ 'తలైవీ' పేరుతో జయలలిత బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్.. జయలలిత పాత్ర పోషించనుంది. అలానే దర్శకురాలు ప్రియదర్శిని 'ది ఐరన్‌ లేడీ' పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా రూపొందించారు. 'క్వీన్' పేరుతో రూపొందించిన ఈ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటించింది.

ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు దీపక్. అసలు జయలలిత గురించి గౌతమ్ మీనన్ కి ఏం తెలుసని ప్రశ్నించాడు. జయలలిత బయోపిక్ ని గౌతమ్ మీనన్ రూపొందిస్తే ఆయనకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. మరి దీనిపై గౌతమ్ మీనన్ ఎలా స్పందిస్తాడో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?