వస్తావా? అని డైరెక్ట్‌గా అడగరు.. స్వాతి షాకింగ్ కామెంట్స్!

Published : Sep 13, 2019, 12:06 PM IST
వస్తావా? అని డైరెక్ట్‌గా అడగరు.. స్వాతి షాకింగ్ కామెంట్స్!

సారాంశం

యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా తెలుగుప్రేక్షకులకు సుపరిచితమైన కలర్స్ స్వాతి ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.  

'కలర్స్' ప్రోగ్రామ్ తో యాంకర్ గా పాపులర్ అయిన స్వాతి ఆ తరువాత నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. అంతేకాదు.. స్టార్ హీరోయిన్ ఇలియానాకి కూడా డబ్బింగ్ చెప్పింది. మల్టీ టాలెంట్ ఉన్న స్వాతి పెళ్లి తరువాత సినిమాలను తగ్గించేసింది.

దాదాపు పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో పని చేసిన స్వాతి కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో డైరెక్ట్ గా వస్తావా...? అని ఎవరూ అడగరని.. నేను ఒంటరిగా ఉన్నానువ్వేం చేస్తున్నావ్ అంటూ మాటలు మొదలుపెడతారని చెప్పుకొచ్చింది.

అయితే తనతో సరదాగా కాసేపు మాట్లాడడం తప్పితే వ్యక్తిగతంగా అలాంటి అనుభవం తనకు ఎదురుకాలేదని.. కానీ నాన్సెన్స్ అని వదిలేసినవి చాలా ఉన్నాయని.. అలా రిజెక్ట్ చేయడం వలన వారికి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి అయితే వేస్ట్ అని చెప్పే సందర్భాలు ఉంటాయని.. ఏదొక కారణం చెప్పి ఆఫర్స్ ని దూరం చేస్తుంటారనివెల్లడించింది.  

అయితే ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని చోట్ల ఇలాంటి వాళ్లు ఉన్నారని తెలిపింది. మన హద్దులు దాటకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని.. తనకు నాన్సెన్స్ అనిపిస్తే ముందే యాక్సెప్ట్ చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పింది. అయితే కొంతమందికి మాత్రం సినిమా ధ్యాస తప్ప వేరేదేమీ ఆశించరని.. మోహన్ కృష్ణ, అవసరాల, నిఖిల్ ఇలా చాలా మందితో పని చేయడం తనకు కంఫర్టబుల్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం