ఆమే జయలలిత కూతురు, జయ సన్నిహితురాలి సంచలన వ్యాఖ్యలు

Published : Dec 02, 2017, 10:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆమే జయలలిత కూతురు, జయ సన్నిహితురాలి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

జయలలితకు కూతురు ఉందా లేదా అనే అంశంపై కొనసాగుతున్న మిస్టరీ జయలితకు కూతురు వుందని వెల్లడించిన జయ సన్నిహితురాలు గీత జయ,శోభన్ బాబులకు అమృత అనే కూతురు వుండేదని వెల్లడి

తానే జయలలిత కూతురుని అంటూ కోర్టుకు ఎక్కి... అక్షింతలు వేయించుకున్న అమృత గుర్తుందా.... ఆమెకు కోర్టు చీవాట్లు పెట్టినా తాజాగా జయ కూతురు ఆమేనంటూ అమృతకు అనూహ్య మద్దతు దక్కింది. అర్థం లేని పిటిషన్ అంటూ కోర్టు అమృతపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆమె జయలలిత కూతురే అనే మాట వినిపిస్తోందిప్పుడు. జయలలిత స్నేహితురాలిగా గుర్తింపు ఉన్న గీత ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలే చేశారు.



జయలలితకు ఒక కూతురు ఉందని గీత అంటున్నారు. అలనాటి తెలుగు స్టార్ హీరో శోభన్ బాబుతో జయలలితకు సంతానం కలిగిందని ఆమె వ్యాఖ్యానించారు. వాళ్లకు ఒక పాప పుట్టిందని, తన పేరు అమృత అని గీత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జయలలిత తనకు స్వయంగా చెప్పిందని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు అమృతతో జయలలితకు సత్సంబంధాలే ఉండేవని.. అన్నారు.
 

ఈ విషయం గురించి శోభన్ బాబు కూడా తనతో చర్చించాడని గీత చెప్పుకురావడం విశేషం. తనకు జయతో కూతురు ఉన్నట్టుగా శోభన్ బాబు చెప్పాడని 1999లోనే తనకు ఈ విషయం తెలుసని గీత అన్నారు. జయ, శోభన్ ల కూతురిని అని కోర్టుకు ఎక్కి, మీడియాకు చెబుతున్న అమృతకు డీఎన్ఏ టెస్టులు చేస్తే విషయం స్పష్టం అవుతుందని గీత అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు