బరువెక్కనున్న కంగనా.. రేటుకు తగ్గ కష్టం!

By Prashanth MFirst Published Apr 14, 2019, 4:47 PM IST
Highlights

బాలీవుడ్ వివాదాల సుందరి కంగనా రనౌత్ ఏం చేసినా సెన్సేషన్ అవ్వడం కామన్. మణికర్ణిక ద్వారా మరోసారి 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న క్వీన్ ఇప్పుడు తమిళ్ పాలిటిక్స్ ని టచ్ చేయడానికి సిద్ధమైంది. 

బాలీవుడ్ వివాదాల సుందరి కంగనా రనౌత్ ఏం చేసినా సెన్సేషన్ అవ్వడం కామన్. మణికర్ణిక ద్వారా మరోసారి 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న క్వీన్ ఇప్పుడు తమిళ్ పాలిటిక్స్ ని టచ్ చేయడానికి సిద్ధమైంది. కోలీవుడ్ దర్శకుడు AL.విజయ్ జయ్ బయోపిక్ ను తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. 

అయితే జయలలిత పాలిటిక్స్ లోకి వచ్చాక థైరాయిడ్ కారణంగా లావెక్కిన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఆ రేంజ్ లో లుక్ తీసుకురాగలదా? అని అనుమానాలు వచ్చాయి. ఈ తరుణంలో అమ్మడు లావెక్కడానికి సిద్ధమైంది. సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడే కాస్త చబ్బీ లుక్ తో కనిపించింది. ఆ లుక్ కోసం కూడా కంగనా ట్రై చేస్తున్నట్లు సమాచారం. 

మొత్తంగా జయలలితకు సంబందించిన 4 డిఫరెంట్ షేడ్స్ లలో కంగనా కనిపించనుందని సమాచారం. ఈ స్థాయిలో కష్టపడాలి కాబట్టే అమ్మడికి 24 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్న కంగనా జయలలిత బయోపిక్ కోసం బారి సైజ్ కి మారిపోతోంది. మరి ఆ లుక్ లో కంగనా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.  

click me!