‘జవాన్’ OTT సర్‌ప్రైజ్‌ ..మనోళ్లు తట్టుకోగలరా?

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) - నయనతార (Nayanthara) జంటగా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

Jawan OTT Version running time approximately 3 hours 15 jsp

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్  భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’ ఏ రేంజిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మార్నింగ్ షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ పాతదే అయినా.. షారుఖ్ ను అట్లీ ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలిమెంట్స్ . బాగా ఉండటంతో.. కలెక్షన్స్  దుమ్ము రేపాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో…కొంచం స్లో డౌన్ అయినా  ఓవరాల్ గా రెండు వారాలు పూర్తి అయ్యే టైంకి తెలుగు లో 53.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ ఆల్ మోస్ట్ 26.45 కోట్ల రేంజ్ ఉంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే అట్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. ‘‘సరైన లెంగ్త్, ఎమోషన్స్‌తో ‘జవాన్‌’ థియేటర్‌ రిలీజ్‌ చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్‌ యాడ్‌ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్‌ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు.  

Latest Videos

ఇంతకీ  సర్‌ప్రైజ్‌  ఏంటంటే సినిమాలో రన్ టైం కోసం డిలేట్ చేసిన సీన్లను ఓటిటి వెర్షన్ లో ఆడ్ చేయనున్నారవు తెలుస్తోంది.  దాంతో సుమారు 3గంటల 15నిమిషాలతో ఓటిటి లోకి రిలీజ్ కానుందని టాక్. అయితే ఇప్పటికే రన్ టైమ్ ఎక్కువైందని ఫీల్ అవుతున్న సినీ లవర్స్...ఇంకా  రన్ టైం పెంచేస్తే తట్టుకోగలరా అనేది పెద్ద సమస్య..దాంతో  ఈ సినిమాను ఓటిటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటోంది ట్రేడ్. అయితే ఆల్రెడీ చూసిన వాళ్లు మరో సారి చూడటం కోసమే ఈ సర్‌ప్రైజ్‌ స్క్రీమ్ లు అనేది నిజం. లేకపోతే అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న ఓటిటివాళ్లు ఏమైపోతారు?.
  
 

vuukle one pixel image
click me!