Bigg Boss Telugu 7: ప్రశాంత్‌తో ఉండాలా? వెళ్లిపోవాలా? తేల్చుకోలేకపోతున్న రతిక.. పవరాస్త్ర కోసం ప్రియాంక సాహసం

 మూడో వారం కంటెండర్‌ కోసం అమర్‌ దీప్‌, ప్రియాంకల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో కంటెండర్‌ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలి. ఈ టాస్క్ కి అమర్‌ దీప్‌ గివప్ ఇచ్చాడు.

prayanka taken big risk and once again start romance between rathika pallavi prashanth arj

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ మూడో వారం సక్సెస్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మూడో వారం పవర్‌ అస్త్ర సాధించి ఎవరో హౌజ్‌లో కంటెస్టెంట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గత రెండు వారాల్లో సందీప్‌, శివాజీ పవర్‌ అస్త్రలను సాధించి హౌజ్‌మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. 

ఇందులో యావర్‌ కంటెండర్‌గా గెలిచాడు. అలాగే అమర్‌ దీప్‌, ప్రియాంక పోటీ పడుతున్నారు. మరోవైపు శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌, శుభ శ్రీ, గౌతం కృష్ణ సైతం కంటెండర్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో శోభాశెట్టికి చికెన్‌ పీస్‌లు తినే టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. కారంగా ఉన్న పీసులు తిన కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె 27 పీసులు తినగా, ఆమెని రీచ్ అయ్యేందుకు శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్‌, గౌతంకృష్ణ ల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో గౌతమ్‌ మొదటగా తిన్నాడు. కానీ పీసులు పూర్తిగా తినకపోవడంతో ఈ టాస్క్ లో ఓడిపోయాడు. దీంతో శోభా శెట్టి పవర్‌ అస్త్ర కంటెండర్‌గా నిలిచింది. 

Latest Videos

మరోవైపు అమర్‌ దీప్‌, ప్రియాంకల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో కంటెండర్‌ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలి. ఈ టాస్క్ కి అమర్‌ దీప్‌ గివప్ ఇచ్చాడు. తాను జుట్టు కత్తిరించుకోలేనని తెలిపారు. తనకు అది ప్రాబ్లమ్ అవుతుందన్నారు. దీంతో ప్రియాంక తీసుకుంది. ఆమె శోల్డర్‌ పైకి జుట్టు కత్తిరించుకుంది. ఇంకా క్యూట్‌గా మారింది. దీంతో మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండ్‌గా నిలిచింది. ఇలా ఇప్పుడు యావర్‌, శోభా శెట్టి, ప్రియాంకలు మూడో పవర అస్త్ర కోసం పోటీలో ఉన్నారు. 

మరోవైపు వీటితోపాటు హౌజ్‌లో రెండు ఆసక్తికర విషయాలను నెలకొన్నాయి. శోభా శెట్టి చికెన్‌ తినేటప్పుడు హౌజ్‌లో మాస్క్ వేసుకున్నది ఎవరో చెప్పాలన్నారు. అందుకు ఆమె చెబుతూ పల్లవి ప్రశాంత్ అని, అతను రెగ్యూలర్‌ టైమ్‌లో ఒకలా ఉంటుందని, నామినేషన్స్ లో మరోలా ఉంటుండని తెలిపింది. ఇన్నోసెంట్‌గా యాక్ట్ చేస్తున్నాడని, కానీ కొన్ని సార్లు ఫైరింగ్‌తో ఉంటున్నాడని పేర్కొంది. చికెన్‌ తినేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మని గుర్తు చేసుకుంది. 

ఇంకోవైపు హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కి అదే విషయాన్ని చెప్పింది. నామినేషన్‌లోనే కాదు, మామూలు రోజుల్లో కూడా నీలోని ఫైర్‌ని బయటకు తీయాలని తెలిపింది. ఇంకోవైపు ప్రశాంత్‌, రతికల మధ్య మరోసారి పులిహోర వ్యవహారం నడించింది. రతిక ముందు పాట పాడి ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, ఆమె అతని పాట అర్థం కాలేదని చెప్పింది. దీంతో ఉంటావా? పోతవా? అనే పరిస్థితికి వచ్చింది.  కాసేపు ఇద్దరి మధ్య పులిహోర వ్యవహారం నడిచింది. 

అలాగే ప్రియాంక హెయిర్‌ కట్‌ చేసిన తర్వాత వాష్‌ రూమ్‌లో టేస్టీ తేజ తన గెడ్డాన్ని, మీసాలను ట్రిమ్‌ చేసుకున్నారు. అయితే ట్రిమ్మర్‌లో క్లిప్‌ లేకపోవడంతో తేజ మీసాలు సగం కట్ అయ్యాయి. దీంతో చేసేదేం లేక మొత్తం మీసాలు తీసేసుకోవాల్సి వచ్చింది. దీంతోపాటు యావర్‌ సైతం కామెడీని పండించాడు. తాను రెండు సార్లు నిద్ర పోతూ బిగ్‌ బాస్‌కి దొరికిపోయాడు. ఆ తర్వాత ఆయన హౌజ్‌మేట్స్ ని ఇమిటేట్‌ చేస్తూ నవ్వులు పూయించాడు. వారిలా యాక్ట్ చేస్తూ రచ్చ చేశాడు. ఇది చూసిన శుభ శ్రీ.. నామినేషన్స్ లో చెప్తా అని చెప్పడం విశేషం. ఇక మూడో వారం నామినేషన్స్ లో అమర్‌ దీప్‌, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్‌, రతిక, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి. 

vuukle one pixel image
click me!