`జవాన్‌` తొలి రోజు వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌..

Published : Sep 08, 2023, 05:49 PM IST
`జవాన్‌` తొలి రోజు వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌..

సారాంశం

 `పఠాన్‌`తో దుమ్మురేపిన షారూఖ్‌ ఖాన్‌ ఇప్పుడు `జవాన్‌`తో మాంస్టర్‌లా విరుచుకుపడుతున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల దుమారం రేపుతుంది. 

షారూఖ్‌ ఖాన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ బాక్సాఫీసుపై దాడికి దిగుతున్నాడు. తన పంజా విసిరాడు. `పఠాన్‌`తో దుమ్మురేపిన ఆయన ఇప్పుడు `జవాన్‌`తో మాంస్టర్‌లా విరుచుకుపడుతున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల దుమారం రేపుతుంది. ఓపెనింగ్‌ డే ఈ చిత్రం సంచలనంగా మారింది. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో రికార్డులను బ్రేక్‌ చేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది.

`జవాన్‌` తొలి రోజు ఏకంగా 130కోట్లు(129.6) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్‌లో ఓపెనింగ్‌ డే కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇది బాలీవుడ్‌లో రికార్డు. గతంలో ఏ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లని సాధించలేదు. షారూఖ్‌ నటించిన `పఠాన్‌` రికార్డులను కూడా ఇది బ్రేక్‌ చేయడం విశేషం. ఈ సినిమా ఇండియాలో 90కోట్లు వసూలు చేసింది. అందులో రూ.65కోట్లు కేవలం నార్త్(హిందీ) మార్కెట్‌ నుంచే ఉండటం విశేషం. ఓవర్సీస్‌లో ఈ మూవీ 40కోట్లు రాబట్టింది. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రం సుమారు 25కోట్లని రాబట్టింది. తెలుగులో ఐదు కోట్లకుపైగానే వచ్చినట్టు తెలుస్తుంది. 

ఈ లెక్కన `జవాన్‌` మూవీ హిందీ సినిమాలకు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. `గడర్‌ 2`, `పటాన్‌`, `వార్‌` వంటి సినిమాల రికార్డులను ఇది బ్రేక్‌ చేయడం విశేషం. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో వెయ్యి కోట్లని సాధించినా ఆశ్చర్యం లేదంటున్నారు. లాంగ్‌ వీకెండ్‌ ఈసినిమాకి కలిసొచ్చే అంశం. సండే వరకు కలెక్షన్లు దుమ్మురేపుతుందని అంటున్నారు. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్‌కి వెళ్తుందనేది అంచనా వేయోచ్చని చెబుతున్నారు ట్రేడ్‌ పండితులు. 

ఇక తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. షారూఖ్‌ సరసన నయనతార, దీపికా పదుకొనె నటించారు. ఇందులో షారూఖ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ప్రియమణి కీలక పాత్ర పోషించగా, విలన్‌గా విజయ్‌ సేతుపతి నటించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం గురువారం విడుదలైన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?