ఈసారి రష్మిక మందన్న వంతు.. ‘పుష్ప2’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన శ్రీవల్లి..

By Asianet News  |  First Published Sep 8, 2023, 3:45 PM IST

‘పుష్ప2’నుంచి వరుసగా అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా రష్మిక మందన్న షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా సెట్స్  నుంచి ఓ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
 


నేషనల్ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప2‘. గతేడాది విడుదలైన ‘పుష్ప : ది రైజ్’కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నెని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా గురించి వరుసగా అప్డేట్స్ అందుతున్నారు. 

పుష్ప2 అప్డేట్ విషయంలో వారం కింద అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్పెషల్ వీడియోతో  Pushpa 2సెట్స్ ను అభిమానులకు చూపించారు. షూటింగ్ స్పాట్, ప్రాపర్టీ, మేకప్ తదితర అంశాలను వివరించారు. అదే వీడియోలో సుకుమార్ కూడా సినిమాపై హైప్ ను పెంచేలా పలు వివరాలను తెలిపారు. ఇక నిన్న ‘పుష్ప2’ సెట్స్ లో ఉన్న వందలాది లారీలకు సంబంధించిన వీడియో యూనిట్ ద్వారా విడుదలైంది. ఇక తాజాగా రష్మిక మందన్న (Rashmika Mandanna) తన వంతుగా సెట్స్ నుంచి ఓ ఫొటోను లీక్ చేసింది. 

Latest Videos

ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ భారీ ఇంటి సెట్ లో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రష్మిక అక్కడే షూటింగ్ కు హాజరైంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఆ ఇంటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. Pushpa2 అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో రష్మిక నుంచి ఇలా అప్డేట్ రావడం పట్ల సంతోషిస్తున్నారు. ఇక సీక్వెల్ లోనూ రష్మిక శ్రీవల్లి పాత్రనే పోషిస్తోంది. 

ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ, జగపతి బాబు, తదితర స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీకి నేషనల్ అవార్డు దక్కిన తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రష్మిక మందన్న తెలుగులో ‘రెయిన్ బో’ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘యానిమల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

click me!