అక్కడా సూపర్ హిట్ అయిన 'జాతిరత్నాలు'

By Surya PrakashFirst Published Sep 4, 2021, 3:43 PM IST
Highlights

 టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా సెన్సేషనల్ సక్సెస్ ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. భారీగా వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా మ్యూజికల్‌ గా కూడా హై  సక్సెస్. చిట్టి నీ నవ్వంటే పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీగా వ్యూస్ ను దక్కించుకున్నాయి. యూట్యూబ్ లో 100 మిలియన్‌ ల వ్యూస్ రికార్డును దక్కించుకుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

మొన్న ఆదివారం జాతిరత్నాలు సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ జెమిని లో టెలికాస్ట్ అయిన జాతిరత్నాలు సినిమా థియేటర్ లో ఏ స్దాయిలో సక్సెస్ అయ్యిందో బుల్లి తెరపై కూడా అదే తరహాలో ఘన విజయాన్ని సొంతం చేసుకోవటం విశేషం.  జెమిని టీవీలో ఈ సినిమా కు గాను 10.2 టీఆర్పీ రేటింగ్ దక్కినట్లు సమాచారం. ఈ స్థాయిలో పెద్ద సినిమాలు మాత్రమే రేటింగ్ ను దక్కించుకుంటాయి. జాతిరత్నాలు ఈ రేంజ్ లో రేటింగ్ దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఈ స్దాయి  టీఆర్పీ రేటింగ్ తో జెమిని టీవీకి మంచి లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే రోజు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు సందడి చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు కూడా టెలికాస్ట్ అయ్యింది. రెండు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. ఎన్టీఆర్ షో కు కాస్త తక్కువగా జాతిరత్నాలు సినిమా రేటింగ్ దక్కించుకుంది. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా ఫరియా అద్బుల్లా నటించిన విషయం తెల్సిందే.
  

click me!