శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జాతి రత్నాలు' సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ చేరాయి. అందుకు తగ్గట్లే విడుదల తర్వాత తన సత్తా చాటుతూ, కలెక్షన్స్‌లోనూ మ్యాజిక్ చేస్తోంది. ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే నవీన్ పోలిశెట్టికే మొత్తం మార్కులు పడ్డాయి. దాంతో ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేసినవారు ఆలోచనలో పడాల్సిన పరిస్దితి.

ఆ వివరాల్లోకి వెళితే...యువి క్రియేషన్స్ వారు అనుష్క శెట్టి,నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రా రా కృష్ణయ్య’ చిత్ర దర్శకుడు మహేశ్ వీరిద్దరితో సినిమా చేయబోతున్నారట. ఈ మేరకు రొమాంటిక్ ప్రేమకథను సిద్ధం చేశారని చెప్తున్నారు. అయితే కథలో అనుష్కకే ఎక్కువ పాత్ర ఉండబోతోందిట. అనుష్కను చూపెట్టి బిజినెస్ చేయాలనేది బ్యానర్ ఆలోచన కూడా. అయితే ఇప్పుడు జాతిరత్నాలు హిట్ తో మొత్తం స్ట్రాటజీ మార్చుకోవాల్సిన పరిస్దితి వచ్చిందిట.
నవీన్ పోలిశెట్టిని అలా ఏదో చూపెట్టి సినిమా చేసేస్తే ..అతని కోసం వచ్చే జనం డిజప్పాయింట్ అవుతారు. దాంతో ఇప్పుడు పూర్తిగా స్క్రిప్టుని మార్చాల్సిన పరిస్దితి టీమ్ కు ఏర్పడింది అంటున్నారు. రెండు మూడు రోజులుగా డైరక్టర్ తన టీమ్ తో కలిసి స్క్రిప్టుపై కుస్తీలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు నవీన్ పాత్రను పెంచాలని నిర్మాతలు ఆర్డర్ వేసారట. అలాగే ఫన్ కూడా పెంచాలని నిర్ణయించుకున్నారట.
చిత్రం కథ విషయానికి వస్తే ...వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ గతేడాది అమెజాన్ ప్రైమ్ వేదికగా వర్కవుట్ కాలేదు.
‘జాతిరత్నాలు’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.