కమల్ నామినేషన్ ధాఖలు: ఆస్తులు, చదువు ఎంతో తెలిస్తే షాక్

By Surya PrakashFirst Published Mar 16, 2021, 1:19 PM IST
Highlights

తమిళనాట ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. తాజాగా మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌.. ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఇందులో ఆయన పేరు కూడా ఉంది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్‌.. దక్షిణ కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

వివరాల్లోకి వెళితే.. విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌. ఆయన వచ్చే ఎలక్షన్స్ లో మరోసారి  తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఈయన ఎమ్మెల్యేగా సోమవారం నామినేషన్ దాఖలు చేసారు. తమిళనాట పాపులర్ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే తరుపన కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో బరిలో దిగారు.  ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 176.93 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు.. చరాస్థులు రూ. 45.09 కోట్లుగా తెలిపారు. 

ఇక లండన్‌లో రూ. 2.50 విలువ చేసే ఇల్లు.. రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక విద్యార్హత 8వ తరగతి చదువుకున్నట్టు తెలిపారు.

 కమల్‌ మాట్లాడుతూ.. ‘నేను ఐఏఎస్‌ అధికారిని కావాలని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని మా నాన్న కలలు కనేవారు. కానీ నేను ఐఏఎస్‌ కాలేకపోయాను. అయితే మా పార్టీలో ఎంతో మంది సివిల్‌ సర్వీస్‌ మాజీ అధికారులు ఉండటం గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి అన్నాడీఎంకే నేత అమ్మన్‌ కే అర్జునన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

234 శాసనసభ స్థానాలున్న తమిళనాడుకు ఏప్రిల్‌ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో తొలిసారిగా బరిలోకి దిగుతున్న మక్కల్‌ నీది మయ్యం.. శరత్‌కుమార్‌ పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నారు. మిగతా చోట్ల వీరు అభ్యర్థులను నిలబెట్టలేదు.

click me!