నాటు నాటు పాటకు డ్యాన్స్ ఇరగ దీసిన జపాన్ యూట్యూబర్...!

Published : Oct 22, 2022, 10:09 AM IST
 నాటు నాటు పాటకు డ్యాన్స్ ఇరగ దీసిన జపాన్ యూట్యూబర్...!

సారాంశం

చాలా మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు. కాగా....  జపాన్ లోని ఓ యూట్యూబర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీయడం గమనార్హం,  

పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్  దేశ వ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.  ఈ సినిమా అన్ని భాషల్లోనూ అదరగొట్టి... కాసుల వర్షం కురిపించింది.  ఈ సినిమా విడుదలై చాలా నెలలు అవుతున్నా,.. దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఈ సినిమాలోని పాటలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు. కాగా....  జపాన్ లోని ఓ యూట్యూబర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీయడం గమనార్హం,

 

ఈ సినిమా ప్రస్తుతం జపాన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ లో ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కుటుంబంతో సహా అక్కడకు వెళ్లి సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ అయితే ఏకంగా జపనీస్ భాషలో మాట్లాడి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే అక్కడి యూట్యూబర్ ఒకరు నాటు నాటు పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది గంటలకే విపరీతంగా వ్యూస్ రావడం విశేషం. ఆ డ్యాన్స్ వీడియో ని మీరు ఇక్కడ చూడవచ్చు.


 

PREV
click me!

Recommended Stories

Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?