అఫీషియల్: నాగ్ 'ది ఘోస్ట్' ఓటిటి రిలీజ్ డేట్

Published : Oct 22, 2022, 07:48 AM IST
అఫీషియల్: నాగ్  'ది ఘోస్ట్' ఓటిటి రిలీజ్ డేట్

సారాంశం

.ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్  లభించింది. కేవలం యాక్షన్ లవర్స్‏ను మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.  

రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన  నాగార్జున యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఇప్పుడు  ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చింది.   ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.థియేటర్స్ లో ప్లాఫ్ టాక్ రావటంతో చూడని అభిమానులు ఇక్కడ చూసి హిట్ చేస్తారని భావిస్తున్నారు. గతంలో నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్ ..ఓటిటిలో అలాగే వర్కవుట్ అయ్యింది. 

 ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్తూ.. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది .   భారీ ధరని ఇచ్చి తెలుగు సహా హిందీ హక్కులు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఓటిటిలో ఈ సాలిడ్ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చెయ్యమంటోంది. ఇక ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు లు నిర్మాణం వహించారు.ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్  లభించింది. కేవలం యాక్షన్ లవర్స్‏ను మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.  

చిత్రం కథేంటంటే..: అనాధ అయిన విక్రమ్ (నాగార్జున)ని కల్నల్ నాగేంద్ర నాయుడు చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు.

20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ.

ఘోస్ట్‌లో నాగార్జున  మరింత స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ కొత్తగా కనిపించాడు. విక్రమ్, ఘోస్ట్ ఇలా రెండు రకాలుగా మెప్పించేశారు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో  హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అనుపమ పాత్ర, అదితి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ లభించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌