జపాన్‌లో ఎన్టీఆర్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన లేడీ ఫ్యాన్స్.. ఆమె చేసిన పనికి షాక్‌

Jr Ntr : ఎన్టీఆర్‌ ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నారు. అక్కడ ఆయన హీరోగా నటించిన `దేవర` చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్‌కి ఓ లేడీ ఫ్యాన్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. 
 

japan lady fan surprised to jr ntr who speak telugu at Japan in telugu arj

Jr Ntr :  ఎన్టీఆర్‌ ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నారు. తారక్‌ నటించిన `దేవర` చిత్రం జపాన్‌లో విడుదలవుతుంది. రేపే(మార్చి 28)న అక్కడ ఈ మూవీ విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా జపాన్‌లో తారక్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. ఆయనతోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. వీరిద్దరు అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమాకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` చూసి తెలుగు నేర్చుకున్న జపాన్‌ లేడీ అభిమాని..

Latest Videos

ఈ క్రమంలో ఎన్టీఆర్‌ని ఓ జపాన్‌ లేడీ ఫ్యాన్‌ ఆశ్చర్యపరిచింది. తారక్‌ కోసం ఓ థియేటర్ వద్దకు చాలా మంది అభిమానులు వచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్‌ అడిగి తీసుకున్నారు. అంతేకాదు ఆయనతో ఫోటోలు దిగారు. అయితే వీరిలో ఓ మహిళా అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచింది. రెండేళ్లుగా తెలుగు నేర్చుకుందట.

అది ఎన్టీఆర్‌ కోసం కావడం విశేషం. `అన్నా అన్నా.. అంటూ పలకరించిన ఆమె.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా చూశాక తెలుగు నేర్చుకోవాలనుకుందట. రెండేళ్లుగా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నట్ట తెలిపింది. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌కి తెలుగులో చెప్పింది ఆ జపాన్‌ అభిమాని. మీరు ఎంతో ఇన్‌స్పైర చేశారని చెప్పింది.

ఇది విని తారక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చాలా స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. అదే సమయంలో జపాన్‌లో తారక్ ఫాలోయింగ్‌కిది నిదర్శనంగా నిలుస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

డివైడ్‌ టాక్‌తో ఐదు వంద కోట్లు వసూలు చేసి `దేవర`

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `దేవర` మూవీకి కొరటాల శివ దర్శకుడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేయగా, శ్రీకాంత్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్‌లో ఇండియాలో విడుదలైన విసయం తెలిసిందే. ఇక్కడ మంచి విజయం సాధించింది.

డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసింది. తెలుగులో కంటే నార్త్ లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కడం విశేషం. దీనికి రెండో పార్ట్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు కొరటాల. దానికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ `డ్రాగన్‌`..

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే పేరు వినిపిస్తుంది. ఇటీవలే మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. జపాన్‌ నుంచి తిరిగి వచ్చాక ఈ మూవీ షూటింగ్‌ తారక్‌ పాల్గొనబోతున్నారు. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుంది.

సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ లో ఉంటుందని తెలిపారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్‌. సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేశారు. మరి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. 
 

vuukle one pixel image
click me!