ప్రపంచంలో బెస్ట్ మదర్‌ నువ్వే.. తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ జాన్వీ కపూర్‌ పోస్ట్ వైరల్‌

Published : May 08, 2022, 03:35 PM ISTUpdated : May 08, 2022, 03:40 PM IST
ప్రపంచంలో బెస్ట్ మదర్‌ నువ్వే.. తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ జాన్వీ కపూర్‌ పోస్ట్ వైరల్‌

సారాంశం

నేడు `మదర్స్ డే` సందర్భంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది  జాన్వీ కపూర్‌. తల్లి తనతో లేకపోయినా, ప్రపంచంలో బెస్ట్ మదర్‌ తనే అంటూ కొనియాడింది. 

అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) బాలీవుడ్‌తోపాటు సౌత్‌ సినిమాని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. హీరోయిన్‌కి స్టార్‌ ఇమేజ్‌ని, లేడీ సూపర్‌ స్టార్‌ అనే ఇమేజ్‌ని తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. హీరోలకు దీటుగా పారితోషికం అందుకున్న ఘనత కూడా ఆమెకే చెల్లుతుంది. గ్లామర్‌ పాత్రలు, ట్రెడిషనల్‌ రోల్స్ ఇలా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించిన ఘనత శ్రీదేవి సొంతం.  అతిలోక సుందరిగా ఇండియన్‌ ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసుకున్న శ్రీదేవి హీరోయిన్‌గానే కాదు, ఇంట్లో బెస్ట్ తల్లిగానూ ఉన్నారు. ఓ వైపు సినీ కెరీర్‌ని, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాణించారు. 

నాలుగేండ్ల క్రితం శ్రీదేశి హఠాన్మరణం చెందిన  విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లి హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో ఆమె కన్నుమూసి కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయితే ఆమె కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. తల్లి చనిపోయాక ఆమె నటించిన తొలి చిత్రం `దఢఖ్‌` విడుదలైంది. దీంతో కూతురుని తెరపై చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయింది శ్రీదేవి. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు గ్లామర్‌ ఫోటో షూట్‌తోనూ ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

ఇదిలా ఉంటే నేడు `మదర్స్ డే` (Mothers day) సందర్భంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది  జాన్వీ కపూర్‌. తల్లి తనతో లేకపోయినా, ప్రపంచంలో బెస్ట్ మదర్‌ తనే అంటూ కొనియాడింది. ఓ ఎమోషనల్‌ పోస్ట్ ని పంచుకుంది. ఇందులో ఆమె చెబుతూ, `నువ్వు మాతో లేకపోయినా నీ ప్రేమని నేను రోజూ పొందుతున్నాను. మీరు మా మధ్య లేకపోయినా ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి మీరే. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను` అంటూ శ్రీదేవిని ఉద్దేశించి ఎమోషన్‌ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్‌. ఈ సందర్భంగా చిన్నప్పుడు తనని ఎత్తుకుని శ్రీదేవి దిగిన ఫోటోని పంచుకుంది జాన్వీ కపూర్‌. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇది వైరల్‌ అవుతుంది. 

ఇక సినిమాల కెరీర్‌ పరంగా జాన్వీ కపూర్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆమె `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తుంది. `బవాల్‌`లో ఆమె వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తుంది. జాన్వీ నటిస్తున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఆమె హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి చేరుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు సైత్‌లోకి కూడా ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే