పవన్‌పై వ్యాఖ్యలు: పోసానిపై జనసైనికుల ఆగ్రహం.. పంజాగుట్ట పీఎస్ వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు

Siva Kodati |  
Published : Sep 28, 2021, 08:37 PM ISTUpdated : Sep 28, 2021, 08:39 PM IST
పవన్‌పై వ్యాఖ్యలు: పోసానిపై జనసైనికుల ఆగ్రహం.. పంజాగుట్ట పీఎస్ వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు

సారాంశం

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోసానిపై ఫిర్యాదు చేసేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.   

అంతకుముందు సోమాజిగూడ్(Somajiguda) ప్రెస్ క్లబ్‌లో పోసాని(Posani) మురళీ కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌(Pawan kalyan)పై విమర్శలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన(Jansena) కార్యకర్తలు వెంటనే పరుగున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చారు. పోసాని మురళీ కృష్ణ ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి యత్నించారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ALso Read:సర్దార్ గబ్బర్‌సింగ్‌` నుంచి పవనే నన్ను తీసేశాడుః పోసాని సంచలన వ్యాఖ్యలు

దీంతో ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ మోహరించారు. పలువరు అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోసాని మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహానీ వుందన్నారు . పవన్ కల్యాణ్‌పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఏమైనా జరిగితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని పోసాని హెచ్చరించారు. 
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

నా తమ్ముడి చావుకు కారణం అదే, బ్యాన్ చేయండి..అత్యంత విషాదంలో సీఎంకి కమెడియన్ రిక్వస్ట్
Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే