నాటు నాటు సాంగ్‌ని గట్టిగా వాడేస్తున్న జైపూర్ పోలీసులు, ఏం చేశారంటే..?

By Mahesh JujjuriFirst Published Jan 15, 2023, 7:29 PM IST
Highlights

ప్రపంచ వాప్తంగా హాట్ టాపిన్ అవుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. మరీ ముఖ్యంగా నాటునాటు సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇక ఇండియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో ఈ సాంగ్ ను గట్టిగా వాడేస్తు్న్నారు జైపూర్ పోలీసులు. 
 

 ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది ట్రిపుల్ ఆర్ సినిమా. ఈమూవీలోని పాటకు కూడా పట్టం కట్టింది ప్రపంచం. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడమే దానికి ఉదాహరణ. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రపంచ ప్రేక్షకులని మెప్పించాయి. ముఖ్యంగా సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లోకి కూడా ఎంట్రీ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సాధించిందీపాట.  బెస్ట్ ఒరిజినల్ సాంగ్  విభాగంలో ఈ అవార్డ్ సొంతం చేసుకుంది.

ప్రపంచ స్థాయి అవార్డ్ రావడంతో దేశమంతా ట్రిపుల్ ఆర్ టీమ్ వైపు చూశారు. అద్భుతం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దాంతో  నాటు నాటు మరింత పాపులర్ అయింది. దేశమంతా ఈ పాటకి ఫిదా అయ్యారు. అంతే కాదు ఈ పాటను ఎలా వాడుకోవాలో ప్లాన్లు కూడా వేస్తున్నారు. ఈక్రమంలోనే. కొంతమంది నాటు నాటు క్రేజ్ ని బిజినెస్ కి వాడుకుంటుంటే మరికొంతమంది జనాల్లో అవగాహన తీసుకురావడానికి వాడుతున్నారు. తాజాగా జైపూర్ పోలీసులు ప్రజలకి డ్రంక్ అండ్ డ్రైవ్ కి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఈ నాటు నాటు పాటని వినూత్నంగా వాడారు.

 

Raising a glass to RRR's Golden Globe win, but let's make sure it's not in our car.🙌🏻

Drinking and driving is a serious crime and can have tragic consequences.

Celebrate responsibly and make smart choices.💫 pic.twitter.com/fm8Wags2nt

— Jaipur Police (@jaipur_police)

చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులేస్తున్న ఫోటోపై.. సే నో టు నో టు నో టు నో టు డ్రింకింగ్‌ వైల్‌ డ్రైవింగ్  అని రాశారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. RRR సినిమా గోల్డెన్‌ గ్లోబ్‌ విజయానికి సంకేతంగా గ్లాస్‌ పైకెత్తి చీర్స్‌ చెప్పండి. కానీ, ఆ గ్లాసు మన కారులో ఉండకుండా చూసుకోండి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరం అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈమూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. చరణ్ జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా.. బ్రిటీష్ మోడల్ ఓలీవియో నటించారు. అజయ్ దేవగణ్, శ్రీయా ఇంపార్టెంట్ పాత్రల్లో మెరిసిన ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పలు సందర్భాల్లో.. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా సోంతం చేసుకుంది సినిమా. 

click me!