'జైలర్' టైటిల్ మార్చనన్నారని భలే ఇరికించారే, రజనీకి దెబ్బ?

Published : Jul 25, 2023, 09:28 AM IST
  'జైలర్' టైటిల్ మార్చనన్నారని భలే ఇరికించారే, రజనీకి దెబ్బ?

సారాంశం

మలయాల డైరెక్టర్ సక్కిర్‌ మడథిల్‌.. 2021 ఆగస్టులో కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో తాము 'జైలర్' టైటిల్​ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. 

సినిమా వాళ్ల వివాదాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా టైటిల్స్, రిలీజ్ డేట్స్ విషయంలో పెద్ద పెద్ద గొడవలు, సెటిల్మెంట్స్ జరుగుతూంటాయి. అయితే ఆ సెటిల్మెంట్స్ ఇరు పక్షాలు వాళ్లు ముందుకు వస్తేనే జరుగుతాయి. కానీ కొన్ని సార్లు మొండికేస్తారు. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ కు అదే జరుగుతోంది.   సూపర్​ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్​ సినిమా టైటిల్ తమదేనంటూ.. మలయాళ దర్శకుడు సక్కిర్‌ మడథిల్‌ కోర్టును ఆశ్రయించి సంగతి తెలిసిందే.  వెంటనే టైటిల్ మార్చుకోవాలని సక్కిర్‌.. సన్​ పిక్చర్స్ నిర్మాణ సంస్థను డిమాండ్ చేశారు. ఈ వివాదంపై త్వరలోనే కోర్టు హియరింగ్ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే తేలేలా లేదని మళయాళ దర్శక,నిర్మాతలు ఓ డెసిషన్ తీసుకుని షాక్ ఇచ్చారు.

ఆ నిర్ణయం ఏమిటంటే...రజనీ 'జైలర్'​ రిలీజ్ రోజే తమ మళయాళ 'జైలర్'​ కూడా రిలిజ్ పెట్టారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. ఇప్పుడు ఒకే రోజు రిలీజ్ అయ్యే ఈ రెండు చిత్రాల్లో  ఏ జైలర్ ని చూడాలనేది కేరళ జనం డిసైడ్ చేసుకోవాలి. ఇంతకీ కేరళ డైరక్టర్ వాదనలో న్యాయం ఉందా అని చూస్తే..

  మలయాల డైరెక్టర్ సక్కిర్‌ మడథిల్‌.. 2021 ఆగస్టులో కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో తాము 'జైలర్' టైటిల్​ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. ఆ టైటిల్ ఖరారయ్యాక అదే ఏడాది నవంబరు 6 నుంచి షూటింగ్ ప్రారంభించారని.. తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయన్నారు. దుబాయ్ షార్జాలో గతేడాది జూన్‌ 26న ఓ ఈవెంట్​లో టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేసినట్లు దర్శకుడు సక్కిర్ తెలిపారు. ఆ ఈవెంట్​కు కమల్‌హాసన్‌, మంజు వారియర్‌లు కూడా హాజరయ్యారని గుర్తుచేశారు.

 అయితే వారి కంటే పది రోజుల ముందు.. రజనీకాంత్‌ హీరోగా సన్‌ పిక్చర్స్‌ 'జైలర్'​ను ప్రకటించిందని సక్కిర్ వాపోయారు. కాగా రజనీకాంత్ 'జైలర్' కేరళలో కూడా విడుదల కానుంది. అందువల్ల ఆ ఒక్క రాష్ట్రంలోనైనా వారి సినిమా టైటిల్​ను మార్చాలని.. సన్ పిక్చర్స్​ సంస్థను ఆయన సంప్రదించినప్పటికీ వారు దానికి అంగీకరించలేదని దర్శకుడు సక్కిర్ తెలిపారు. అయితే రెండు సినిమా కథల నేపథ్యం వేరైనప్పటికీ.. టైటిల్ ఒకటే అవ్వడం వల్ల ప్రేక్షకులు సందిగ్ధతకు గురవుతారని.. అది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని సక్కిర్‌ అభిప్రాయపడ్డారు. అయితే దీనికి పరిష్కారం దొరకలేదు. అందుకే మళయాళ 'జైలర్'​ టీమ్ తమ సినిమాను ఆగస్ట్ 10 రిలీజ్ చేయాలని డిసెషన్ తీసుకుంది. మరి రజనీ 'జైలర్'​పై మళయాళ 'జైలర్'​ ఇంపాక్ట్ పడుతుందా చూడాలి. ఏదైమైనా    రజనీకాంత్ సినిమా రిలీజ్​కు ముందు ఇలాంటి లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది.
 
 ధ్యాన్‌ శ్రీనివాసన్‌ హీరోగా.. సక్కిర్‌ దర్శకత్వం వహించిన మలయాళ సినిమాను ఎన్‌. కె. మహమ్మద్‌ నిర్మించారు. ఈ చిత్రం పీరియాడికల్ జోనర్​లో ఉండనుంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. మోహన్‌లాల్‌ , శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు