`జై బాలయ్య` వచ్చాడు.. అభిమానులకు సంబరాలు తెచ్చాడు.. `వీరసింహారెడ్డి` ఫస్ట్ సాంగ్‌..

Published : Nov 25, 2022, 11:22 AM ISTUpdated : Nov 25, 2022, 11:23 AM IST
`జై బాలయ్య` వచ్చాడు.. అభిమానులకు సంబరాలు తెచ్చాడు.. `వీరసింహారెడ్డి` ఫస్ట్ సాంగ్‌..

సారాంశం

`వీరసింహారెడ్డి` చిత్రంలోని మొదటి సాంగ్‌ని విడుదల చేశారు. మాస్‌ ఆంథెమ్‌ పేరుతో `జై బాలయ్య` అంటూ సాంగ్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఓ పండుగ వాతావరణంలో వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నయా మూవీ `వీరసింహారెడ్డి`. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి సాంగ్‌ని విడుదల చేశారు. మాస్‌ ఆంథెమ్‌ పేరుతో `జై బాలయ్య` అంటూ సాంగ్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఓ పండుగ వాతావరణంలో వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంక్రాంతికి పండుక్కి అసలైన సెలబ్రేషన్‌ని తీసుకురాబోతుందనేలా ఉండటం విశేషం. 

తమన్‌ సంగీతం అందించిన ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, కార్జ్ ముల్లా ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌, శంకర్‌ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇదిలా ఉంటే సంగీత దర్శకుడు తమన్‌ పాటలు చాలా వరకు కాపీ కొడతారని, తన పాత పాటలనే తిప్పి తిప్పి కొడతారనే విమర్శలున్న విషయం తెలిసిందే. అయితే `జై బాలయ్య` సాంగ్‌ విషయంలోనూ కాపీ అనే విమర్శలు వస్తున్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ విమర్శలు రావడం గమనార్హం. ఈ సాంగ్‌ నిన్ననే లీక్‌ అయ్యింది. దీన్ని విజయశాంతి నటించిన `ఒసేయ్‌ రాములమ్మ` చిత్రంలో టైటిల్‌ సాంగ్‌కి దగ్గరగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. 

మరి ఈ కాపీ మ్యాటర్‌ పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్‌ ని మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వారిలో ఊపు తీసుకొస్తుంది. సంక్రాంతి పండగ ఇప్పుడే వచ్చిందా? అనే ఫీలింగ్‌ తీసుకొస్తుందని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `వీరసింహారెడ్డి` చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇందులో బాలయ్యకి జోడీగా శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌ కుమార్, దునియా విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ