ఫ్రెండ్స్ తో తాగి తందనాలు ఆడిన జగపతిబాబు.. అరుదైన ఫోటో పోస్ట్..

Published : Sep 05, 2023, 02:39 PM IST
ఫ్రెండ్స్ తో తాగి తందనాలు ఆడిన జగపతిబాబు.. అరుదైన ఫోటో పోస్ట్..

సారాంశం

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌ పాత్రలతో మెప్పిస్తున్న జగపతిబాబు బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌. ఆయన ఏం మాట్లాడినా బోల్డ్ గా ఉంటుంది. తాజాగా ఆయన లుక్‌ కూడా బోల్డ్ గాఉంది. షర్ట్ విప్పేసి ఫ్రెండ్స్ తో తాగి తందనాలు ఆడుతున్న ఫోటోని పంచకున్నారు.

మ్యాన్లీ హీరో, ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నారు జగపతిబాబు. హీరోగానే అనేక సినిమాలు చేసి మెప్పించాడు. మల్టీస్టారర్లతోనూ మెప్పించారు. గత కొంత కాలంగా హీరోకి ఫుల్‌ స్టాప్‌ పెట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. విలన్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు. నిజం చెప్పాలంటే ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతిబాబు మోస్ట్ హ్యాపెనింగ్‌ యాక్టర్‌గా నిలిచారు. 

సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా రియాక్ట్ అయ్యే జగపతిబాబు.. తాజాగా తన అభిమానులకు షాకిచ్చారు. తన అరుదైన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఇందులో షర్ట్ విప్పి డాన్సులు చేస్తున్నారు జగపతిబాబు. ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనికి అదిరిపోయే క్యాప్షన్‌ ఇచ్చాడు. `ఫ్రెండ్స్ తో తాగి బట్టు ఊడతీసి తందనాలు ఆడటమ్‌ అంటే ఇదే` అని కాప్షన్‌ ఇచ్చాడు. 

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సూపర్‌ సర్‌ అని, ఎంజాయ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో మీరు మాత్రమే కాదు, మీ మాటలు కూడా బట్టలు విప్పేలా ఉంటాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక జగపతిబాబు ఇటీవల `రుద్రాంగి` చిత్రంలో నటించింది. ఆయన ఇందులో భీమ్‌రావు దేశ్‌ముఖ్‌ దొర పాత్రలో నటించాడు. పాజిటివ్‌గా, నెగటివ్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. 

దీంతోపాటు `రామబాణం`, `గని`, `రాధేశ్యామ్‌`, `గుడ్‌ లక్‌ సఖీ`, `అఖండ`, `లక్ష్య`, `రిపబ్లిక్‌`, `టక్‌ జగదీష్‌`, `మిస్‌ ఇండియా` వంటి చిత్రాలు చేశారు. అయితే ఆయన నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. ప్రస్తుతం `సలార్‌`లో రాజమన్నార్‌` పాత్రలో నటిస్తున్నారు. మరో పవర్‌ఫుల్‌ రోల్‌ ఆయనకు పడిందని చెప్పాలి. దీంతోపాటు `గుంటూరు కారం`, `పుషప్2`లో నటిస్తూ బిజీగా ఉన్నారు జగపతిబాబు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు