
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్ గా ఎదిగాడు జగపతిబాబు(Jagapathi Babu). హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు.. ఆతరువాత స్టైలీష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతిబాబు... హీరోగా కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగే సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నటువంటి జగపతిబాబు(Jagapathi Babu) కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన లెజెండ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు.. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ోల కూడా నటిస్తూ.. బిజీగా ఉన్నారు జగపతి బాబు(Jagapathi Babu). తమిళంలో వరుస ఆఫర్లు సాధిస్తున్నాడు జగపతి. అంతే కాదు.. జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు.. పర్సనల్ విశేషాలు కూడా పంచుకుంటుంటాడు. అయితే అప్పుడప్పుడు ఆయన శేర్ చేస్తున్నటువంటి.. వీడియోలు.,. ఫోటోలు వైరల్ అవ్వడంతో పాటు ఆయన ఇమేజ్ను ఇంకా పెంచుతోంది. ఇప్పటికే ఆయన ఎన్నో ఫన్నీ వీడియోలను శేర్ చేయగా.. తాజాగా మరో ఫన్నీ ఫోటోలు జగపతిబాబువి వైరల్ అవుతున్నాయి.
జగపతిబాబు ఇంట్లో క్లీనింగ్ పని మొదలు పెట్టాడు. సాధారణంగా ఇంట్లో ఉంటేు కిచెన్ లో వంట చేస్తూ.. అప్పుడప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతుంటాడు జగ్గుబాయ్.. ఆఫోటోస్ తన అభిమానులతో పంచుకుంటూ ఉండటం మనం చూస్తున్నాము. అలాగే తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా జగపతిబాబు ఇంట్లో పని వాడిగా మారిపోయారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది
ఈ ఫోటో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. జగ్గుభాయ్ ఇల్లు శుభ్రం చేసే పనిలో పడ్డారు. కర్రచేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నారు.ఇక ఈ ఫోటోని స్వాయంగా షేర్ చేసిన జగపతిబాబు అందరూ నేను పగలు రాత్రి కష్టపడి భారీగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు కదా మరి ఈ ఫోటోతో నా పరిస్థితి ఏంటో తర్వాత చెబుతాను మీరు గెస్ చేయండి అంటూ తెలిపారు.ఈ ఫోటో చూస్తున్న కొందరు ఇదేదైనా సినిమా షూటింగ్లో భాగమై ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.