ఆ వ్యక్తి ఒక్కడే నమ్మి రూ.50 లక్షలు ఇచ్చారు: జగపతిబాబు

Published : Aug 27, 2018, 04:45 PM ISTUpdated : Sep 09, 2018, 11:43 AM IST
ఆ వ్యక్తి ఒక్కడే నమ్మి రూ.50 లక్షలు ఇచ్చారు: జగపతిబాబు

సారాంశం

ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతి బాబు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో నటుడిగా కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే కొన్నాళ్ల తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతి బాబు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో నటుడిగా కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే కొన్నాళ్ల తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో అతడికి హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు జగపతి బాబు.

ఈ విషయాలను ఎలాంటి మొహమాటాలు లేకుండా బహిరంగంగానే చెబుతుంటారు. తన కూతురి పెళ్లి సమయంలో చేతిలో కావాల్సినంత డబ్బు లేక సింపుల్ గా చేసేశానని చెప్పిన జగపతి ఒకానొక సమయంలో ఇంట్లో ఖర్చులకి కూడా ఇబ్బంది పడిన సందర్భాన్ని చెప్పుకొచ్చాడు. 'నేను బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదు. ఆ విషయంలో నాకు బాధ లేదు. ఎందుకంటే ఎవరో ఇస్తారని నేను కూడా ఆశించలేదు.

అయితే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మాత్రం కష్టకాలంలో ఉన్న నాకు రూ.50 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. అది కూడా వడ్డీ లేకుండా.. అయితే కొంతకాలం తరువాత ఆ డబ్బుని ఆయన తిరిగివ్వమన్నారని.. దాని కోసం మరో అప్పు చేయాల్సి వచ్చిందని'' నవ్వుతూ చెప్పాడు జగపతిబాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ యాక్టర్స్ లో ఒకడిగా మారాడు జగపతి. చేతిలో ఎన్ని ప్రాజెక్టులు, భారీ రెమ్యునరేషన్ వస్తోంది. అలాగని లగ్జరీగా బ్రతికే ఆలోచన తనకి లేదని వెల్లడించారు. 


ఇవి కూడా చదవండి.. 

ఆ నిర్మాత వారం రోజులు భోజనం కూడా తెప్పించలేదు.. జగపతిబాబు కామెంట్స్!

జగ్గుభాయ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది!

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు