బిర్యానీ అడిగితే మీల్స్ పెడితే ఎలాగ, అందుకే పోయిందన్న జగ్గూ భాయ్

Published : Aug 08, 2017, 10:24 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
బిర్యానీ అడిగితే మీల్స్ పెడితే ఎలాగ, అందుకే పోయిందన్న జగ్గూ భాయ్

సారాంశం

విలన్ పాత్రలతో స్టార్ డమ్ తిరిగి పొందిన హీరో జగపతి బాబు తాజాగా జయజానకి నాయకతో ప్రేక్షకుల ముందుకొస్తున్న జగ్గూ భాయ్ పటేల్ సర్ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేజన్న జగపతి బాబు

ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడిగా వెలుగొంది ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో జగపతిబాబు. తర్వాత హీరోగా వరుసగా ఫ్లాప్స్ రావటంతో కొత్త పంథాలో విలన్ గా మారి ఒక రేంజ్ లో దూసుకుపోతోన్న జగపతిబాబు, 'పటేల్ సార్' తో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పోస్టర్స్ లో జగపతిబాబు కొత్త లుక్ తో కనిపించారు. సాయికొర్రపాటి నిర్మాత కావడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. అయితే విడుదలైన తరువాత ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 ఆ ప్లాప్ ని జగపతిబాబు అంగీకరించారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అనుకున్నారనీ, తాము ఫ్యామిలీ స్టోరీ చూపించేసరికి నిరాశ చెందారని అన్నారు. బిరియానీ కోసం వచ్చిన వాళ్లకి .. మామూలు భోజనం పెట్టడం వల్లనే పరాజయాన్ని చవి చూడవలసి వచ్చిందని చెప్పారు. మళ్లీ హీరోగా చేయాలా .. వద్దా? అనేది తన దగ్గరికి వచ్చే కథలను బట్టి ఉంటుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..