
బాలీవుడ్ భామలు తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. Jacqueline Fernandez అందుకు అతీతం కాదు. రూ. 200 కోట్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయిన Sukesh Chandrashekhar తో జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) తరచుగా జాక్వెలిన్ కి సమన్లు జారీ చేస్తూనే ఉంది.
ఆగష్టులో జాక్వెలిన్ తొలిసారి ఈడీ ముందు విచారణకు హాజరైంది. ఆ సమయంలో ఈడీ అధికారులు జాక్వెలిన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత మరో మూడుసార్లు ఈడీ జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. కానీ మూడుసార్లు జాక్వెలిన్ విచారణకు డుమ్మా కొట్టింది.
జాక్వెలిన్ వ్యవహారం అందరిని షాక్ కి గురిచేస్తోంది. రూ 200 కోట్ల చీటింగ్ కేసులో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఈడీ తోనే గేమ్స్ ఆడుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆగష్టు 30న తొలిసారి జాక్వెలిన్ విచారణకు హాజరైంది. ఆ తర్వాత సెప్టెంబర్ 25 తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అప్పుడు జాక్వెలిన్ హాజరు కాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 15న మరోసారి డుమ్మా కొట్టింది.. రీసెంట్ గా 16వ తేదీ కూడా విచారణ ఉంది.. దానిని కూడా జాక్వెలిన్ లైట్ తీసుకుంది.
Also Read: ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి
వృత్తి పరమైన కమిట్మెంట్స్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాని జాక్వెలిన్ కారణం చెప్పింది. జాక్వెలిన్ వైఖరిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
సుఖేష్ చంద్రశేఖర్ భార్య లీనా పాల్ ద్వారా అతడితో జాక్వెలిన్ ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుఖేష్, లీనా పాల్ లని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఐటెం బ్యూటీ నోరా ఫతేహి కూడా ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.