`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా ఐకాన్‌ స్టార్‌

By Aithagoni Raju  |  First Published Oct 18, 2021, 2:11 PM IST

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం పాజిటివ్‌ టాక్ తో రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో సక్సెస్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. 


అఖిల్‌ అక్కినేని కోసం ఐకాన్‌ స్టార్‌ వస్తున్నారు. అఖిల్‌ ఇటీవల పూజా హెగ్డేతో కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో టీమ్‌ని అభినందించేందుకు Allu Arjun వస్తున్నారు. సక్సెస్‌ మీట్‌కి గెస్ట్ గా బన్నీ రానుండటం విశేషం. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ నెల 19న ఈ చిత్ర సక్సెస్‌మీట్‌ని గ్రాండ్‌గా నిర్వహించబోతుండటం విశేషం. 

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా Most Eligible Bachelorలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది తొలి చిత్రం. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరించారు. విజయదశమి పండుగ సందర్భంగా ఈ నెల 15న సినిమా విడుదలైంది. మొదట సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత పుంజుకుంది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుందని నిర్మాతలు తెలిపారు. కలెక్షన్లు కూడా రోజు రోజుకి పెరుగుతున్నట్టు తెలిపారు. 

Latest Videos

పండగ సీజన్‌ని క్యాష్‌ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు వెల్లడించారు. దీంతో సినిమా ప్రమోషన్‌ని మరింతగా పెంచామని, ఇటీవల వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేయగా, దానికి మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ప్లాన్‌ చేశామని, దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ వచ్చి, యూనిట్‌ని అభినందించబోతున్నట్టు తెలిపారు. జీఏ2కి బన్నీ ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. పైగా బన్నీవాసు, వాసువర్మలకి ఆయన మంచి స్నేహితుడు కూడా. ఈ నేపథ్యంలో బన్నీ రాబోతుండటం విశేషంగా చెప్పొచ్చు. 

also read: పవన్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వీడియోలో చూసింది నిజం కాదు.. మంచు విష్ణు క్లారిటీ..

ఇక ఈ చిత్రంలో akhil‌, Pooja Hegdeతోపాటు ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ ముఖ్యపాత్రలు పోషించారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా `లెహరాయి` పాట ఎంతగానో పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమా పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయిలో ఉండే అంచనాలు, పెళ్లి తర్వాత ఏం జరుగుతుందనే కాన్సెప్ట్ తో రూపొందింది.

click me!