'జబర్దస్త్' ఫేం చమ్మక్ చంద్ర హీరోగా సినిమా!

Published : Feb 04, 2019, 10:04 AM IST
'జబర్దస్త్' ఫేం చమ్మక్ చంద్ర హీరోగా సినిమా!

సారాంశం

'జబర్దస్త్' షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది. ఎందఱో కమెడియన్స్ కి ఈ షో లైఫ్ ఇచ్చింది.

'జబర్దస్త్' షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది. ఎందఱో కమెడియన్స్ కి ఈ షో లైఫ్ ఇచ్చింది. సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు రానివారు కూడా ఈ షోతో పాపులర్ అయ్యారు.

ఈ షోతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చమ్మక్ చంద్ర హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రాజ్ కార్తికేయన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి 'రామ సక్కనోళ్లు' అనే టైటిల్ పెట్టారు. 

ఈ సినిమా చమ్మక్ చంద్ర సరసన హీరోయిన్ గా మేఘన కనిపించనుంది. సతీష్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఘంటాడి కృష్ణ, మహిత్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ని బట్టి సినిమా గ్రామీణ నేపధ్యానికి సంబంధించిన కథగా తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు