
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తే.. జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అంటున్నాడు రంగస్థలం మహేష్. జబర్థస్త్ కామెడీ షోద్వారా ఫేమస్ అయిన ఈ కమెడియన్.. రంగస్థలం సినిమాలో ఛాన్స్ కొట్టేసి.. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. రామ్ చరణ్ అనుచరుడిగా నవ్వులు పూయించాడు. దాంతో జబర్థస్త్ మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్ అయిపోయాడు. దాంతో అప్పటి నుంచి వరుస సినిమా ఆఫర్లు సాధిస్తూ.. వెండితెరపై సెటిల్ అయ్యాడు మహేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మహేష్.
మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్‌ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానన్నారు రంగస్థలం మహేష్. అంతే కాదు ఆయన గొప్ప మనస్తత్వం గురించి చెపుతూ.. మూవీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ ఏది తింటారో.. అక్కడ ఉన్నవారందరికీ.. పెట్టించేవారని చెప్పారు.
ఇక తన సినిమా కష్టాల గురించి కూడా మహేష్ వివరించారు. ఈస్ట్ గోదావరిలోని శంఖరగుప్తంలో తాను పుట్టానని. సినిమాలకోసం హైదరాబాద్ వచ్చినప్పుడు.. చేతిలో రూపాయి లేకుండా రోడ్ల వెంట తిరిగానన్నారు. తన తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని.. ఈజీవితం ఎందుకు అని విరక్తి కలిగింది అన్నారు. సుకుమార్ గారి వల్ల.. ప్రస్తుతం తాను సినిమాల్లో నటిస్తూ.. లైఫ్ ను లీడ్ చేస్తున్నాను అన్నారు.
ఇక హైదరాబాద్ లోఇల్లు కొనేస్తోమత లేదు కాని.. తన సొంత ఊరిలో.. మంచి ఇల్లు కట్టుకుంటున్నా అన్నారు. తన ఊరిలో పవన్ కల్యాళ్ అభిమానుల ఎక్కువగా ఉన్నారని.జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు. దేవుడి దయ వల్ల పార్టీ తరఫున తనకు పోటీచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉందని మహేష్ వివరించారు.