The Kerala Story: వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ మేకర్స్ కి బిగ్ షాక్... షోస్ క్యాన్సిల్!

Published : May 05, 2023, 11:37 AM ISTUpdated : May 05, 2023, 11:43 AM IST
The Kerala Story: వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ మేకర్స్ కి బిగ్ షాక్... షోస్ క్యాన్సిల్!

సారాంశం

 కొచ్చి, తిరువనంతపురంలోని పీవీఆర్ సినిమాస్ లో'ది కేరళ స్టోరీ' షోస్ రద్దయ్యాయి. తాజా సమాచారం ప్రకారం కేరళ వ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శనలు ఆగిపోయాయి. 

ఏప్రిల్ 26న ది కేరళ స్టోరీ ట్రైలర్ విడుదల కాగా వివాదం రాజుకుంది. ఆ చిత్ర కంటెంట్ ఓ మతాన్ని కించపరిచే విధంగా ఉంది. ఇది పొలిటికల్ ప్రాపగాండ మూవీ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనల మధ్య కేరళ స్టోరీ మే 5న విడుదలైంది. ఈ చిత్ర షోలు ప్రధాన నగరాలతో పాటు పలు చోట్ల క్యాన్సిల్ చేశారు. థియేటర్స్ యాజమాన్యాలు ప్రేక్షకులకు డబ్బులు రిఫండ్ చేశాయి.  

కొచ్చి నగరంలోని  పీవీఆర్ సినిమాస్, ఒబెరాన్ మాల్ లో షోలు వేయాల్సి ఉంది. అయితే రెండు చోట్ల  ప్రదర్శన రద్దు చేశారు. తిరువనంతపురంలోని లులు మాల్‌ నందు గల  పీవీఆర్ సినిమాస్ లో కూడా ప్రదర్శన ఆగిపోయింది. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో కేవలం రెండు లొకేషన్స్ లో ది కేరళ స్టోరీ ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. నిరసనల నేపధ్యంలో కేరళ వ్యాప్తంగా పలు చోట్ల చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. 

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి పెద్ద చర్చకు దారి తీసింది. రాజకీయంగా ప్రకంపనలు రేపింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ది కేరళ స్టోరీ మేకర్స్ పై మండిపడ్డారు. ఇది విద్వేషాలను రెచ్చగొట్టే చిత్రం అన్నారు. సీపీఐ(ఏం), కాంగ్రెస్ పార్టీలో ఈ చిత్రాన్ని వ్యతిరేకించాయి. 32000 మంది అమ్మాయిలు లవ్ జిహాద్ కి బలయ్యారు. తీవ్రవాదులుగా మార్చడ్డారనేది ఈ చిత్ర సబ్జెక్టు.కేరళకు చెందిన హిందూ, క్రిస్టియన్ మహిళలను ముస్లింలు ఇరాక్, సిరియా దేశాలకు పంపి ISIS ఉగ్రవాదులుగా తయారు చేశారని ఈ చిత్రంలో చెప్పారు. 

గత ఏడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ ఇదే తరహా వ్యతిరేకతను ఎదుర్కొంది. 90లతో కాశ్మీర్ పండిట్స్ ముస్లిమ్స్ చేతిలో ఊచకోతకు గురయ్యారనే అంశంపై ది కాశ్మీర్ ఫైల్స్ తెరకెక్కింది. ఇది బీజేపీ ప్రాపగాండా చిత్రమని విపక్షాలు ఆరోపించాయి. 
 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌