స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ చౌదరి, బుల్లితెర బ్యూటీ ఏడుపుకి కారణం ఎవరంటే...?

Published : Mar 14, 2023, 06:33 PM ISTUpdated : Mar 14, 2023, 06:35 PM IST
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ చౌదరి, బుల్లితెర బ్యూటీ ఏడుపుకి కారణం ఎవరంటే...?

సారాంశం

ఈకాలంలో ఆడపిల్లలు తండ్రికి దగ్గరగా ఉంటారు. తండ్రి తె ఫ్రెండ్లీగా ఉంటారు. అటువంటి తండ్రి దూరం అయితే... వారి బాధ చెప్పడానికి మాటలు కూడా రావు. ఆ పరిస్థితిని తాను ఫేస్ చేసాను అంటోంది రీతూ చౌదరి. స్టేజ్ పైనే బోరున విలపించింది జబర్థస్త్ భామ.   

తన తండ్రిని తలుచుకుని కన్నీటిపర్యంతం అయ్యింది  బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి. తండ్రితో తనకు ఉన్న అనుబంధం.. ఆయన మెమరీస్ ను గుర్తు చెచ్చుకుని స్టేజ్ పైనే వెక్కివెక్కి ఏడ్చింది. ప్రతీ విషయం తన తండ్రితో శేర్ చేసుకుంటానని, తండ్రీ కూతురులా కాకుండా.. స్నేహితుల్లా ఉంటామంటూ.. స్టేజ్ పైనే కన్నీరు కార్చేసింది జబర్దస్త్ యాక్టర్ రీతూ చౌదరి. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో తన బాధను  వెల్లడించడంతో పాటు బోరున కన్నీరు పెట్టింది రీతూ. 

లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ  ప్రోమోలో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో  మరోసారి తన తండ్రిని గుర్తు చేసుకుంది. తనపై ఉన్న ప్రేమను కన్నీటి రూపంలో చెప్పింది. రీతూ అలా స్టేజ్ పై కన్నీరు పెట్టుకుంటుంటే అక్కడున్నవారంతా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమోతో పాటు...రీతూ చౌదరి  వీడియో వైరల్ గా మారింది.

రీతూ చౌదరి.. సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యింది. సీరియల్స్ తో పాటు కామెడీ షోలు కూడా చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత బుల్లితెర టాప్ కామెడి షో అయిన జబర్దస్త్ ద్వారా తన  క్రేజ్ ను, పాపులారిటీని ఒక్క సారిగా పెంచుకుంది బ్యూటీ. 

ఇక స్క్రీన్ మీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ పాపులారిటీ సాధించింది రీతూ. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలు ఇన్ స్టాలో శేర్ చేస్తూ.. కుర్రాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు, రీల్స్ చేస్తూ.. ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది రీతూచౌదరి.  ఇక తన తండ్రితో కలిసి చాలా వీడియోస్ ను ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంది బ్యూటీ.  ఈ క్రమంలోనే రీతూ తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో ఆమె చాలా కాలం కోలుకోలేకపోయింది. 

 

స్నేహితుడిలా ఉండే తండ్రిని కోల్పోయి దాదాపు డిప్రెషన్ లోకి వెళ్ళిన ఆమెకు.. తన వృత్తి మళ్ళీ మనిషిని చేసింది. ప్రొగ్రామ్స్ లో పార్టిస్పేట్ చేస్తూ.. తన బాధను మర్చిపోగలిగింది. ఇక తన బాధను చెపుతూ.. స్టేజ్ పైనే కన్నీటిపర్యంతం అయ్యింది బ్యూటీ.  శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ ప్రోమో సోషల్ మిడియాలో వైరల్ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు