జబర్థస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం, స్టార్ కమెడియన్ తండ్రి మృతి

By Mahesh JujjuriFirst Published Jan 24, 2023, 9:25 AM IST
Highlights

జబర్దస్త్ స్టార్ లేడీ కమెడీయన్ రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండె పోటుతో  ఆమె తండ్రి కన్నుమూశారు. ఈ సంఘటన  ఆదివారం జరిగింది. 

గుండెపోటుతో జబర్థస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి తండ్రి  తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ కమెడీయన్లు.. రీతూ ఫ్యాన్స్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తన తండ్రి మృతిపై రీతూ చౌదరి కన్నీరు మున్నీరు అయ్యింది. తన  తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రీతూ చౌదరి.

తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో శేర్ చేసింది రీతూ చౌదరి. పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇది నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావ్ నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ నీ కూతురు దగ్గరికి తిరిగిరా  అంటూ రీతూ చౌదరీ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. 

 

ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న జబర్థస్త్ కమెడియన్ల తో పాటు ఆమె స్నేహితులు, జబర్థస్త్ ఫ్యాన్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రీతూకి ఆమె తండ్రి అంటే చాలా ఇష్టం. తల్లి కంటే కూడా తండ్రితోనే ఆమె ఎక్కువ చనువుతో ఉండేది. ఆమో చేసే రీల్స్, యూట్యూబ్ వీడియోస్ లో కూడా ఈ విషయం తెలిసేది. రీతూ చౌదరికి ఆమె తండ్రితో ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఇంట్లో అందరి కంటే ఆమెకు తండ్రి అంటేనే చాలా ఇష్టం. ఏదున్నా ఆయనతోనే పంచుకుంటుంది. 

అలాంటిది ఇప్పడు ఆ తండ్రి లేడనే విషయాన్ని రీతూ చౌదరి జీర్ణించుకోలేకపోతోంది. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి తనతో లేడని, ఇంక రాడనే విషయంపై రీతూ చౌదరి కన్నీరు మున్నీరవుతోంది. జబర్దస్త్ కమెడీయన్లు, రీతూ చౌదరి అభిమానులు ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరలంటూ ప్రార్థిస్తున్నారు.

click me!