తెలుగులో విడుదల కాబోతున్న శివరాజ్ కుమార్ ‘వేద’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

By team telugu  |  First Published Jan 23, 2023, 5:58 PM IST

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar)  లేటెస్ట్ ఫిల్మ్ ‘వేద’. గతేడాది చివర్లో కన్నడలో రిలీజ్ అయ్యి హిట్ గా నిలిచింది. తెలుగు వెర్షన్ లోనూ విడుదల కాబోతుండగా.. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
 


కన్నడ యాక్షన్ డ్రామాగా గతేడాది డిసెంబర్ 23న విడుదలైన చిత్రం ‘వేద’ (Vedha).కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.  ఏ. హర్ష రచన, దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. జీ స్టూడియోస్‌తో కలిసి గీతా పిక్చర్స్ బ్యానర్‌పై గీతా శివరాజ్‌కుమార్ నిర్మించారు. 

కాగా, కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన ఈ చిత్రం ఆయనకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇది ఆయన 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో ‘వేద’ చిత్రం మొదటి వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Latest Videos

గతేడాది కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు వెర్షనన్ లోనూ రిలీజ్ కు సిద్దం అవుతుండటం విశేషం. కంచి కామాక్షి కలకత్తా కాళీ  క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా  ఆవిష్కరించింది చిత్ర బృందం. 

పోస్టర్ లోని శివరాజ్ కుమార్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. చుట్టూ జనాల మధ్య కూర్చిలో కూర్చున్న శివరాజ్ కుమార్ స్టిల్ అదిరిపోయింది. పోస్టర్ డిజైన్ కూడా బాగుండటంతో తదుపరి అప్డేట్స్ పై ఆసక్తి నెలకొంది. త్వరలో మరిన్ని వివరాలను కూడా వెల్లడించనున్నారు. చిత్రంలో శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు తదితరులు ఆయా పాత్రలను పోషించనున్నారు. 

click me!