మళ్ళీ హాస్పిటల్ లో చేరిన పంచ్ ప్రసాద్, నరకం చూస్తున్న జబర్థస్త్ కమెడియన్

Published : Apr 08, 2023, 04:56 PM IST
మళ్ళీ హాస్పిటల్ లో చేరిన పంచ్ ప్రసాద్,  నరకం చూస్తున్న జబర్థస్త్ కమెడియన్

సారాంశం

నలుగురిని కడుపుబ్బా నవ్వించే జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్.. నరకం చూస్తున్నాడు. హాస్పిటల్ లో అల్లాడిపోతున్నాడు. రీసెంట్ గా మళ్ళీ హాస్పిటల పాలు అయ్యాడు ప్రసాద్. ఈ విషయాన్ని ఆయన భార్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

పంచ్ ప్రసాద్ జబర్థస్త్ స్టేజ్ పై నిలుచున్న ఫలంగా ఎటువంటి కదలికా లేకుండా కడుపుబ్బా నవ్వించగలడు. అంత టాలెంట్ ఉంది అతనిలో.. కాని విధి ఆయన జీవితంపై పగపట్టింది. రెండు కిడ్నీలకు ప్రాబ్లమ్ రావడంతో.. నరకం చూస్తున్నాడు పంచ్ ప్రసాద్. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా తొణకకుండా థైర్యంగా ఉంటున్నారు ప్రసాద్.  ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అల్లాడిపోతున్నారు. ప్రసాద్ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.  డాక్టర్ల పర్యావేక్షణలో ఉంటూ.. అప్పుడప్పుడు జబర్థస్త్ స్కిట్లు కూడా చేస్తున్నాడు ప్రసాద్.  

డాక్టర్లు చెప్పిన ప్రకారం డయాలసిస్‌ తప్పని సరిగా చేయించుకోవాలి. డయాలసిస్‌ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదంకావడంతో  ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటూ వస్తున్నారు. ఇక ప్రసాద్ ఇంత థైర్యంగా ఉండటానికి కారణం  ఆయన భార్య. ఆమె అన్ని విధాన ప్రసాద్ కు చేదోడు వాదోడుగా ఉంటుంది. పంచ్‌ ప్రసాద్‌ కు ఓ యూట్యూబ్‌ ఛానల్‌  ఉంది. దాని నుంచి వచ్చే అంతో కోంతో.. తన వైధ్యానికి సాయంగా ఉంటుంది. ఇక అందులో తనకు  సంబంధించిన విషయాలను ఆ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు ప్రసాద్. 

ఇక  తాజాగా ప్రసాద్ ఆరోగ్యంపై తన యూట్యూబ్‌ ఛానల్‌లో తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రసాద్‌ ఆసుపత్రిలో ఉన్న వీడియోలో ఆయన ఇబ్బంది గురించి స్పస్టంగా తెలుస్తోంది. అయితే  ఓ ఇంజెక్షన్‌ కోసం ప్రసాద్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా పంచ్‌ ప్రసాద్‌ భార్య మాట్లాడుతూ.. ఇంజక్షన్‌ కోసం వచ్చాం. ఆయన కుడి చేతిపై ఇప్పటి వరకు 50 ఇంజెక్షన్లు చేశారు. డయాలసిస్‌ నొప్పి తట్టుకోలేము. డయాలసిస్‌ తర్వాత క్లీడ్‌ ఇచ్చినపుడు కొంచెం బాగా ఉంటుంది. ప్రసాద్‌ ఇంజెక్షన్లు అంటే భయపడిపోతున్నాడు. అదికూడా ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవటానికి అని వివరించింది. 

PREV
click me!

Recommended Stories

Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?